మంచిర్యాల టౌన్: మున్సిపాలిటీలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరిచి, వేతనాలు పెంచాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటా...
మంచిర్యాల టౌన్: మున్సిపాలిటీలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరిచి, వేతనాలు పెంచాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు పా లాభిషేకం చేశారు. మున్సిపల్ కాంట్రాక్టు కార్మిక సంఘం ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కారం కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారానికి ఐదో రోజుకు చేరుకున్నా యి. ఇందులో భాగంగా కేసీఆర్పై తమకు పూర్తి నమ్మకం ఉందని, తమను క్రమబద్ధీకరించడంతో పాటు పూర్తి స్థా యిలో వేతనాలు అందిస్తారన్న ఆశతో ఉన్నామని సం ఘం గౌరవాధ్యక్షుడు హరిక్రిష్ణ తెలిపారు. సంఘం అధ్యక్షుడు గోగర్ల ఆశయ్య, ప్రధాన కార్యదర్శి మాడుగుల తిరుపతి, నాయకులు ఆవునూరి సుధాకర్, మల్యాల రవి, ఆ త్మకూరి తిరుపతి, చిలుముల దుర్గయ్య, చిన్నారి జయ, చిప్పకుర్తి నర్సయ్య, బూడిద సాగర్, జంగపల్లి రాయలిం గు, గొడిసెల వెంకటి, సుందిళ్ల రవి, కొమురయ్య, శంకర్, తదితరులు పాల్గొన్నారు.
