న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ర్టానికి రావాల్సిన విద్యుత్ వాటాను ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదని, పీపీఏలను అన్యాయంగా రద్...
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ర్టానికి రావాల్సిన విద్యుత్ వాటాను ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదని, పీపీఏలను అన్యాయంగా రద్దు చేసుకుని తెలంగాణ వాటాను ఎగ్గొట్టిందని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. మంగళవారం లోక్సభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సవరణలు చేసే బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతం పేరుతో తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలుపుతూ చీకటి ఆర్డినెన్స్ ద్వారా కేంద్రం అన్యాయం చేసిందని అన్నారు.
