ఖైరతాబాద్, మార్చి 24: వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని సబ్‌స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం సుమారు ఐదు గంటల ప...
ఖైరతాబాద్, మార్చి 24: వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని సబ్‌స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం సుమారు ఐదు గంటల ప్రాంతంలో జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. వెంగళరావునగర్ జీటిఎస్ కాలనీ 132 కెవి సబ్‌స్టేషన్ ప్రాంగణంలో కాపర్ కేబుల్స్ నిల్వ ఉంచారు. నగరంలో జరుగుతున్న అండర్‌గ్రౌండ్ కేబులింగ్ పనుల నిమిత్తం తెచ్చిన బండిల్స్‌ను ఇక్కడ ఉంచారు. సోమవారం సాయంత్రం 5గంటల ప్రాంతంలో కేబుల్స్ నుండి పొగలు వస్తుండడాన్ని గమనించిన స్థానికులు సమాచారాన్ని విద్యుత్ సిబ్బందికి తెలియజేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న విద్యుత్ సబ్‌స్టేషన్ సిబ్బంది కార్యాలయంలో ఉన్న అగ్ని నియంత్రణ పరికరాలు తీసుకువచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. క్షణాల వ్యవధిలోనే మంటలు పెరిగిపోవడంతో భాయందోళనకు గురైన వారు అక్కడికి నుంచి పరుగులు తీసి ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. అగ్నిప్రమాదం చోటుచేసుకొన్న సుమారు గంట తరువాత ఫైర్ వాహనం అక్కడికి చేరుకొని మంటలు ఆర్నే ప్రయత్నం ప్రారంభించారు. అప్పటి నీరు సరిపోకపోవడంతో జలమండలికి చెందిన రెండు ట్యాంకర్లను అక్కడికి రప్పించి మంటలను అదుపులోనికి తెచ్చేందుకు శ్రమించారు.
