(25 Mar) వనస్థలిపురం, మార్చి 24: గుర్తుతెలియని ఓ యువతిని పెట్రోల్ పోసి దారుణంగా హత్య చేసిన సంఘటన హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చే...
(25 Mar) వనస్థలిపురం, మార్చి 24: గుర్తుతెలియని ఓ యువతిని పెట్రోల్ పోసి దారుణంగా హత్య చేసిన సంఘటన హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 20 నుంచి 25 సంవత్సరాల వయస్సు గల యువతిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేసి ఒంటిపై పెట్రోల్‌ను పోసి నిప్పంటించి నగర శివారులోని అంబర్పేట్ సమీపంలో ఔటర్ రింగురోడ్డు కీసరగుట్ట వద్ద నిర్మానుష్య ప్రాంతంలో పడేశారు. మంగళవారం అదే ప్రాంతంలో పశువులను కాస్తున్న ఓ వ్యక్తి మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పూర్తి ఆధారాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
