కంతనపల్లి టు కాకతీయ కెనాల్!

-రెండోదశతో ఎస్సారెస్పీ ఆయకట్టు స్థిరీకరణ -7.50 లక్షల ఎకరాలకు నీరందించటమే లక్ష్యం -ఊరట్టం వద్ద రిజర్వాయర్, జంగాలపల్లి, గుండ్లసింగారం వద్ద ...

-రెండోదశతో ఎస్సారెస్పీ ఆయకట్టు స్థిరీకరణ
-7.50 లక్షల ఎకరాలకు నీరందించటమే లక్ష్యం
-ఊరట్టం వద్ద రిజర్వాయర్, జంగాలపల్లి, గుండ్లసింగారం వద్ద సిస్టర్న్‌లు
-ఇరిగేషన్ అధికారుల తాజా ప్రతిపాదన
-సాధ్యాసాధ్యాలపై రేపు సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే

హన్మకొండ: జిల్లాలో మరో ఎత్తిపోతల పథకం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పీవీ నర్సింహారావు కంతనపల్లి సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) ఆయకట్టును స్థిరీకరించే దిశగా అడుగులేస్తోంది. కంతనపల్లి ప్రాజెక్టు రెండో దశ ద్వారా గోదావరి నదిలోని 50 టీఎంసీల నీటిని వినియోగించుకుని ఎస్సారెస్పీ తొలి, రెండో దశ పరిధిలోని సుమారు 7.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. కంతనపల్లి నుంచి 105 కిలోమీటర్ల దూరంలో ఉన్న వరంగల్ నగరంలోని గుండ్లసింగారం వరకు ఎత్తిపోతల ద్వారా గోదావరి నీటిని కాకతీయ ప్రధాన కాలువలోకి తరలిస్తే మూడు జి ల్లాల పరిధిలోని ఎస్సారెస్పీ ఆయకట్టుకు గ్రావిటీ ద్వారా నీరందగలదని భావిస్తోంది. ఈ మేరకు భారీ నీటి పారుదల శాఖ అధికారులు తాజాగా కంతనపల్లి నుంచి గుండ్లసింగారం వద్ద ఉన్న కాకతీయ ప్రధాన కాలువ వరకు టన్నెల్ తవ్వకం, గ్రావి టీ ద్వారా గోదావరి నీటిని తరలించేందుకు ప్రతిపాదనలు త యారు చేశారు. సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వేద్వారా ఆదివారం ఈ ప్రతిపాదనలను స్వయంగా పరిశీలించనుండటం విశేషం.

ఎస్సారెస్పీ తొలి, రెండో దశ పరిధిలోని ఆయకట్టుకు ఆది నుంచి నీరందటం లేదు. ఈ రెండు దశల పరిధిలో సుమారు 7.50 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో తొలి దశ పరిధిలోని 3.10 లక్షల ఎకరాలు పూర్తిగా జిల్లాకు చెందినది. రెండో దశ పరిధిలోని 4.40 లక్షల ఎకరాల్లో 1,13,578 ఎకరాల ఆయకట్టు జిల్లాది. 2,57,508 ఎకరాలు నల్లగొండ, 68,914 ఎకరాలు ఖమ్మం జిల్లాలో ఉంది. ఈ రెండు దశల్లోని ఏడున్నర లక్షల ఎకరాల్లో 4,23,758 ఎకరాల ఆయకట్టు జి ల్లా పరిధిలోనిది కావటం గమనార్హం. కరీంనగర్‌లోని ఎల్ ఎం డీ నుంచి కాకతీయ ప్రధాన కాలువ ద్వారా ఎస్సారెస్పీ తొలి, రెండో దశలోని ఆయకట్టుకు నీరందాల్సి ఉంది. కాకతీ య ప్రధాన కాలువలో 224వ కిలోమీటర్ వద్ద తొలి, 284వ కిలోమీటర్ వద్ద రెండో దశ ఆయకట్టు ప్రారంభం అవుతుంది. కాకతీయ ప్రధాన కాలువతో పాటు ఆయకట్టుకు నీరందించే డిస్ట్రిబ్యూటరీ, పంట కాలువల నిర్మాణం పూర్తయి ఏళ్లు కరిగిపో తున్నాయే గాని ఎస్సారెస్పీ నుంచి నీరు వచ్చిన దాఖలాల్లేవు. ఆంధ్రా పాలకులే ఇందుకు కారణం. ధ్వంసమై, పిచ్చిమొక్కలతో దర్శనమిస్తున్న ఎస్సారెస్పీ కాలువలు ప్రస్తుతం రైతులను వెక్కిరిస్తున్నాయి. ఆంధ్రా ప్రభుత్వాలు నిర్దేశిత ఆయకట్టుకు నీరు ఇవ్వకపోయినా తమ కాంట్రాక్టర్లకు పనులు కల్పించటానికి కొన్ని సందర్భాల్లో ఎస్సారెస్పీ కాలువలకు మరమ్మతులు చేశాయి. రూ.వేల కోట్ల ప్ర ధనం వృథాకు కారణమయ్యాయి.

కంతనపల్లి ప్రాజెక్టే పెద్దదిక్కు..
ఎస్సారెస్పీ తొలి, రెండో దశ పరిధిలోని ఆయకట్టుకు ఎస్సారెస్పీ నుంచి నీరందించటం సాధ్యం కాదని గుర్తించిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రత్యామ్నయంపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఇటీవల జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్ ఎస్సారెస్పీ తొలి, రెండో దశలోని ఆయకట్టుకు ఎస్సారెస్పీ నుంచి నీరిస్తామని చెప్పి ఆంధ్రా పాలకులు తెలంగాణ రైతాంగాన్ని మో సం చేశారని అన్నారు. ఎస్సారెస్పీ నుంచి తొలి, రెండో దశ ఆయకట్టుకు నీరిస్తామంటే మన ప్రభుత్వం కూడా ఆయకట్టుదారులను మోసం చేసినట్లే అవుతుందని చెప్పారు. ఎస్సారెస్పీ తొలి, రెండో దశ ఆయకట్టుకు కంతనపల్లి ప్రాజెక్టే పెద్ద దిక్కని, ఎత్తిపోతలతో గోదావరి నీటిని కంతనపల్లి ప్రాజెక్టు ద్వారా కాకతీయ ప్రధాన కాలువలోకి తరలించి ఎస్సారెస్పీ తొలి, రెండో దశ పరిధిలోని ఏడున్నర లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. 

ఈ అంశంపై నీటి పారుదల రంగ నిపుణులు, ఇరిగేషన్ ఉన్నతాధికారులతో మాట్లాడి త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు. కొద్ది రోజుల తర్వాత రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై అధ్యయనం కోసం రిటైర్డ్ ఇంజినీర్లతో ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఉద్యోగ విరమణ చేసిన ముగ్గురు సీఈ లు, ఒక ఎస్‌ఈ, మరో ఈఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ వివిధ జిల్లాల్లో పర్యటించి ప్రాణహిత-చేవెళ్ల, ఎల్లంపల్లి, వరదకాలువ, ఎస్సారెస్పీ, దేవాదుల, కంతనపల్లి ప్రాజెక్టులను పరిశీలించింది. సంబంధిత అధికారులతో కలిసి ఈ ప్రాజెక్టులపై లోతుగా అధ్యయనం చేసింది. ఈ కమిటీతో సీఎం కేసీఆర్, రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు దశలవారీగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు. త్వరలోనే ఈ ఫైమెన్ కమిటీ సాగునీటి ప్రాజెక్టులపై నివేదిక అందజేయనుంది. మూడు రోజుల కిందట నీటి పారుదల రంగ నిపుణులు ఏరియల్ సర్వే ద్వారా గోదావరి నదిపై నిర్మిస్తున్న సాగు నీటి ప్రాజెక్టులను పరిశీలించారు.

తొలి దశలో గోదావరిపై బ్యారేజీ..
పీవీ నర్సింహారావు కంతనపల్లి సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా తొలి దశలో గోదావరిపై ఏటూరునాగా రం మండలం కంతనపల్లి గ్రామం వద్ద బ్యారేజీ నిర్మాణ పను లు ప్రారంభమయ్యాయి. 2009లో అప్పటి ప్రభుత్వం కంతనపల్లి ప్రాజెక్టు తొలి, రెండో దశ నిర్మాణ పనుల కోసం రూ. 10,409 కోట్లతో పరిపాలన అనుమతి ఇచ్చింది. అయితే, తొలిదశలో కంతనపల్లి గ్రామం వద్ద బ్యారేజీ నిర్మాణం కోసం రూ.1809 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచింది. ఎస్‌ఈడబ్ల్యూ-రిత్విక్ సంయుక్తంగా ఈ తొలి దశ పనులను దక్కించుకున్నాయి. ఐదేళ్ల కాలపరిమితిలో తొలి దశ పనులను పూర్తి చేసేందుకు నీటి పారుదల శాఖతో 2013లో ఒప్పందం కుదుర్చుకున్నాయి. అంటే ఒప్పందం ప్రకారం ఈ ప్రాజెక్టు తొలి ద శ పనులు 2018 సెప్టెంబరు వరకు పూర్తి కావల్సి ఉంది. అయి తే, ఇప్పటి వరకు కంతనపల్లి వద్ద గోదావరిపై బ్యారేజీ నిర్మా ణం కోసం సర్వే పనులు పూర్తయ్యాయి. 

డిజైన్ కూడా తయా రు చేశారు. దీని ప్రకారం 1.97 కిలోమీటర్ల పొడవున బ్యారేజీ నిర్మిస్తారు.మధ్యలో 12X10 సైజ్‌తో 131గేట్లు ఏర్పాటు చేస్తా రు. ఈ బ్యారేజీలో 22.50 టీఎంసీల నీరు నిలువ ఉండగల దు. కంతనపల్లి కంటే ముందు గోదావరి నదిపై గుట్టలగంగా రం వద్ద నిర్మాణం చేపట్టిన జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం నిర్వహణకు ఈ బ్యారేజీ ఉపయోగపడనుంది. కం తనపల్లి ప్రాజెక్టు తొలిదశలో భాగంగా బ్యారేజీ వద్ద 280 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం గల ఫోర్‌బే పవర్ హౌజ్ నిర్మాణానికి కూడా నీటి పారుదల శాఖ ఇంజినీర్లు డిజైన్ చేశారు. ఈ డిజైన్‌కు ప్రభుత్వ ఆమోదం లభించగానే బ్యారేజీ వద్ద పవర్ హౌస్ నిర్మాణానికి టెండర్లు పిలవనున్నారు.

ఎస్సారెస్పీ ఆయకట్టు కోసం రెండో దశ..
ఆయకట్టు అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వం ఎస్సారెస్పీ తొలి, రెండో దశ పరిధిలోని ఆయకట్టు స్థిరీకరణ కోసం కంతనపల్లి ప్రాజెక్టురెండో దశ నిర్మాణం చేపట్టాలనే ఆలోచనలో ఉంది. ఈ మేరకు తాజాగా భారీనీటి పారుదల శాఖ అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. కంతనపల్లి నుంచి నగరంలోని గుండ్లసింగారం వద్ద ఉన్న కాకతీయ ప్రధాన కాలువ వరకు 105 కిలోమీటర్ల పొడవు టన్నెల్ తవ్వకం జరపాలని ప్రతిపాదించారు. గుండ్లసింగారం వద్ద కాకతీయ ప్రధాన కాలువలోకి కంతనపల్లి ప్రాజెక్టు రెండో దశ ద్వారా నీటిని తరలిస్తే గ్రావిటీ ద్వారా ఏడున్నర లక్షల ఎకరాల ఆయక ట్టుకు నీరందగలదని ప్రభుత్వం భావి స్తోంది. 

కంతనపల్లి నుంచి గుండ్లసింగారం మధ్య తాడ్వాయి మండలం ఊరట్టం వద్ద తుమ్మలవాగుపై రిజర్వాయర్, ము లుగు మండలం జంగాలపల్లి గ్రామం వద్ద సిస్టర్న్ నిర్మాణం చేపట్టాలని నీటి పారుదల శాఖ ఇంజినీర్లు తమ ప్రతిపాదన ల్లో పేర్కొన్నారు. గుండ్లసింగారం వద్ద కూ డా మరో సిస్టర్ను నిర్మించాలని ప్రభుత్వానికి సూచించారు. కంతనపల్లి ప్రాజెక్టు రెండో దశలో గోదావరి నది నుంచి విని యోగించుకునే 50 టీఎంసీల నీటిలో సాగునీటికి 47, తాగు నీటికి 3 టీఎంసీలు వాడుకునేలా ప్రతిపాదనలు చేశారు. గోదా వరి నదిపై చేపట్టి న కంతనపల్లి ప్రాజెక్టును ఆదివారం ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించిన తర్వాత సీఎం కేసీఆర్ ఎస్సారెస్పీ ఆయకట్టు స్థిరీకరణ కోసం రూపొందించిన కంతనపల్లి రెండో దశ నిర్మా ణ పనుల ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసిం ది. కంతనపల్లి ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తు న్న దేవాదుల ప్రాజెక్టు ఇన్‌చార్జి ఎస్‌ఈ బంగారయ్య శుక్రవారం సంబంధిత అధికారులతో సమావేశమై సమీక్ష జరిపారు.

COMMENTS

పేరు

Adilabad AUDIO RELEASES ENTERTAINMENT GOSSIPS Health HYDERABAD INTERNATIONAL Job Search Jobs KARIMNAGAR KHAMMAM MAHABOOBNAGAR MEDAK MOVIE REVEWS NALGONDA NATIONAL NIZAMABAD Rangareddy SINGARENI NEWS TECHNOLOGY TELANGANA NEWS VIDEO SONGS WARANGAL worldcup2015
false
ltr
item
Tdaily.In - Telangana News: కంతనపల్లి టు కాకతీయ కెనాల్!
కంతనపల్లి టు కాకతీయ కెనాల్!
http://4.bp.blogspot.com/-D2qa3aRdKV0/VRX3rwl92JI/AAAAAAAAEkc/3DmjIRP6wPQ/s1600/wgl.jpg
http://4.bp.blogspot.com/-D2qa3aRdKV0/VRX3rwl92JI/AAAAAAAAEkc/3DmjIRP6wPQ/s72-c/wgl.jpg
Tdaily.In - Telangana News
https://telugunewvideos.blogspot.com/2015/03/blog-post_832.html
https://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/2015/03/blog-post_832.html
true
2091677902228022841
UTF-8
Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS CONTENT IS PREMIUM Please share to unlock Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy