మిరుదొడ్డి : రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెందగా పెద్ద కూతురే అన్నీ తానై ముందు నడిచి తల కొరివి పెట్టిన హృదయ విదారక సంఘటన మిరుదొడ్డిలో బ...

ప్రమాదంలో మృతి చెందిన గున్నాల భిక్షపతికి ఇద్దరు కుమార్తెలు సౌజన్య, మనీషాలు ఉన్నారు. కుమారులు లేనందున పెద్ద కుమార్తె సౌజన్య తండ్రి శవయాత్రలో తలకొరివి పట్టుకుని ముందు నడుస్తుండడంతో చూసిన ప్రతి ఒక్కరినీ కలచి వేసింది. బతుకు దెరువు కోసం కొండపాక మండలం సిర్సినగండ్ల గ్రామం నుంచి వలస వచ్చిన అంకిళ్ల నరసింహారెడ్డి అంత్యక్రియలు కూడా మిరుదొడ్డిలోనే నిర్వహించారు.
ఇరు కుటుంబాలు ఆర్థికంగా నిరుపేదలు కావడంతో గ్రామస్తులే చందాలు పోగు చేసి అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామంలో కూలీనాలి చేసుకుని జీవిస్తున్న యువకులు ఒకే సారి మృత్యువాత పడడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.