(24 Mar) ఆదిలాబాద్ రూరల్, మార్చి 23: ప్రజలకు సేవలు అందించడానికి పోలీసు వ్యవస్థలో భారీ మార్పులు చేశామని ఎస్పీ తరుణ్‌జోషి అన్నారు. సోమవారం...
(24 Mar) ఆదిలాబాద్ రూరల్, మార్చి 23: ప్రజలకు సేవలు అందించడానికి పోలీసు వ్యవస్థలో భారీ మార్పులు చేశామని ఎస్పీ తరుణ్‌జోషి అన్నారు. సోమవారం స్థానిక పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల విభాగం వివి ధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి పోలీసు స్టేషన్లో వౌలిక సదుపాయాలు కల్పించామని, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకుజాప్యం చేయకూడదని తెలిపారు. రోజువారి ఆర్జీల సమస్యలపై దార్యప్తు పూర్తిచేసి నివేదిక పంపాలని అన్నారు. ప్రతి రోజు ఉదయం 9 గంటలకు టెలికాన్ఫరెన్స్ ద్వారా నమోదైన కేసులపై, శాంతి భద్రతల పరిరక్షణపై వివరణ తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. జిల్లా పోలీసులు తమ విధులను నిజాయితీగా నిర్వహించాలని సూచించారు. జిల్లాకు చెందిన షి టీంలు ప్రస్తుతం హైదరాబాద్‌లో శిక్షణ పొందుతున్నారని, త్వరలో జిల్లాలో షి టీంలను విస్తరిస్తామని అన్నారు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత కల్పించేందుకు పోలీసులు నూతన వ్యవస్థను అవలంబిస్తున్నారని, ఈ వ్యవస్థ సత్ఫలితాలిస్తుందని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో శిక్షణ ఐపి ఎస్ అధికారి విశ్వజిత్ కంపాటి, ఆదిలాబాద్ డి ఎస్పీ ఎ లక్ష్మనారాయణ రెడ్డి, ఫిర్యాదుల విభాగం అధికారులు శివాజి చౌహన్, జైస్వాల్ కవిత, రియాజొద్దిన్, సిసి రవీందర్, డిసిఆర్బి ఎస్సై జి.మల్లేష్, ఎస్సైలు టిడి నందన, యంఎ కరీం, అన్వర్ ఉల్ హఖ్ తదితరులు పాల్గొన్నారు.
