Mission Kakatiya, Telangana కుభీర్, మార్చి 29: మిషన్ కాకతీయలో భాగంగా చేపడుతున్న చెరువుల అభివృద్ది పనులలో అవినీతి అక్రమాలను ఎట్టి పరిస్...
![]() |
| Mission Kakatiya, Telangana |
కుభీర్, మార్చి 29: మిషన్ కాకతీయలో భాగంగా చేపడుతున్న చెరువుల అభివృద్ది పనులలో అవినీతి అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించమని ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. మండలంలోని బెల్గాం చెరువులో ఆదివారం ఎమ్మెల్యే మిషన్ కాకతీయ పనులను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువుల అభివృద్ది ద్వారా సాగునీటి విస్తీర్ణం పెరగడంతోపాటు చేపల పెంపకం వల్ల మత్సకార కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. అదేవిధంగా భూగర్భ జలాలు సైతం పెరుగుతాయని, వర్షపు నీరు వృధా కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఈ పనులకు రూ.27 లక్షలు నిధులు మంజూరీ కాగా షెల్టు, తూము మరమ్మత్తు లకోసం నిధులను ఖర్చు చేయాల్సి ఉంది. పనులలో నాణ్యత ప్రమాణాలు పా టించాలని అవినీతి అక్రమాలను ఉపేక్షించేది లేదని ఈ సందర్బంగా ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అధికారులను, కాంట్రాక్టర్లను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సావిత్రి మారుతి, చౌహాన్ శంకర్, సాలీ రమేష్, మోహినొద్దిన్, మల్లన్న, రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.
