టీడీపీ శాసన సభాపక్ష నేత యర్రబెల్లి దయాకర్‌రావు సత్తుపల్లి రూరల్: స్వార్థపరులైన కొందరు నాయకులు తమకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీని ద్వేషిస్...
టీడీపీ శాసన సభాపక్ష నేత యర్రబెల్లి దయాకర్‌రావు
సత్తుపల్లి రూరల్: స్వార్థపరులైన కొందరు నాయకులు తమకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీని ద్వేషిస్తున్నారని, ఇది.. కన్నతల్లిని తిట్టినట్టేనని టీడీపీ శాసన సభాపక్ష నేత యర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. టీడీపీ సత్తుపల్లి, అశ్వారావుపేట ముఖ్య కార్యకర్తల సమావేశం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధ్యక్షతన గురువారం గురువారం సత్తుపల్లిలోని లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్లో జరిగింది. యర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. ‘‘టీడీపీ కార్యకర్తలు ముప్పై ఏళ్లుగా పార్టీ జెండాను ఒక భుజంపై, నాయకులను మరో భుజంపై మోశారు.
తుమ్మల, తలసాని వంటి నాయకులు బయటకు వెళ్లి, నాడు తమను భుజాలపై మోసిన టీడీపీ కార్యకర్తలపై కక్ష సాధిస్తుంటే చూస్తూ ఊరుకోం’’ అని అన్నారు. టీడీపీని తిట్టిన వారికి పాపం తగులుతుందన్నారు. పార్టీ కార్యకర్తలను, నాయకులకు కాపాడుకునే శక్తి తమకు ఉందని అన్నారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్ధి యర్రబెల్లి రాంమోహన్‌రావును గెలిపించే బాధ్యత టీడీపీ కార్యకర్తలు, నాయకులపై ఉందని అన్నారు.
ఊడబీకిన నాగళ్లు దున్నేందుకు పనికిరావు : నామా
టీడీపీ, బీజేపీ ఊడబీకిన నాగళ్లను టీఆర్ఎస్ పార్టీ భుజాన వేసుకుందని, అవి దున్నేందుకు పనికిరావని టీడీపీ నేత, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ నాయకులు దిగజారుడు రాజకీయాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించిన కేసీఆర్.. ఇప్పటివరకు జీతాలు ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు.
ఉద్యమకారులను విస్మరించి.. నకిలీలకు అందలం : సండ్ర
తెలంగాణ ఉద్యమకారులను విస్మరించి, నకిలీ నాయకులను అందలమెక్కించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని టీడీపీ నేత, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. టీడీపీ శ్రేణనులను మోసగించిన నాయకులకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయన్నారు. ‘‘కేసీఆర్‌కు దమ్ముంటే, పార్టీ మారిన నాయకులతో రాజీనామా చేయించి టీఆర్ఎస్ తరఫున ఎన్నికల్లో పోటీకి దింపాలి’’ అని సవాల్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి యర్రబెల్లి రాంమోహన్‌రావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తుళ్ళూరి బ్రహ్మయ్య, అధికార ప్రతినిధి కందిమళ్ళ నాగప్రసాద్, మెచ్చా నాగేశ్వరరావు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మూర్తి ధర్మారావు, మారుతి అప్పారావు, జిల్లా అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్.. పెద్ద మూర్ఖుడు
వైరా: సీఎం కేసీఆర్.. ప్రపంచంలోనే అతి పెద్ద మూర్ఖుడని టీడీపీ శాసన సభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆయన గురువారం ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరులకు గుర్తింపు ఇవ్వలేదని, ఉద్యమంతో సంబంధం లేని వారు పార్టీ పదవులు అనుభవిస్తున్నారని విమర్శించారు. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ను ప్రజలు తరిమికొడతారని అన్నారు. సభలో ఎమ్మెల్సీ అభ్యర్థి రాంమోహన్‌రావు తదిరులు పాల్గొన్నారు.