ఫోన్ కొట్టండి సమస్యలను పరిష్కరించుకోండి

సికింద్రాబాద్, మార్చి 29: సనత్‌నగర్ నియోజకవర్గాన్ని నగరానికే తలమానికంగా తయారు చేస్తానని, ఇందులో ప్రజలను కూడా భాగస్వాములను చేసి సుందరంగా ...

సికింద్రాబాద్, మార్చి 29: సనత్‌నగర్ నియోజకవర్గాన్ని నగరానికే తలమానికంగా తయారు చేస్తానని, ఇందులో ప్రజలను కూడా భాగస్వాములను చేసి సుందరంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. అదివారం మారేడ్‌పల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అమీర్‌పేట్, రాంగోపాల్‌పేట్, బాన్సిలాల్‌పేట్, పద్మారావునగర్, బల్కంపేట్, బేగంపేట్, సనత్‌నగర్ డివిజన్లలో రూ. 392.5 కోట్ల వ్యయంతో చేపట్టిన నాలాల ఆధునీకరణ, బిటి, సిసి రోడ్లు, మంచినీటి పైపులైన్, కమ్యూనీటి హాల్స్, డ్రైనేజీ లైన్లు, ప్లే గ్రౌండ్‌లో స్టోర్స్ రూమ్స్, సింటెక్స్ ట్యాంక్స్, స్మశానవాటికల అబివృద్ధి, వీధిదీపాల ఏర్పాటు పనులు సిద్ధిమై ఉన్నాయని ఒక్కొక్క డివిజన్‌లో ఒక్కొరోజు ప్రారంభోత్సవాలను నిర్వహిస్తామని తెలిపారు. మంచినీటి పైపులైన్ల కోసం మరో రూ 4 కోట్ల పనులు టెండర్ దశలో ఉన్నాయని చెప్పారు. ఎంసిహెచ్ సికింద్రాబాద్, ఖైరతాబాద్ నుంచి వివిధ పనులకు మరో రూ. 4 కోట్లు రావాల్సి ఉందని తెలిపారు. సనత్‌నగర్‌లో రిజర్వాయర్, మారేడ్‌పల్లి, ఉస్సెన్ సాగర్ పంప్‌హౌజ్, ధరమ్‌కరం రోడ్డులో ఎఎంఎన్ ట్రంక్ లైన్, మహబుబ్ కాళాశాల ముందు సివరేజ్ లైన్‌కు సంబందించిన మరో రూ. 40.41 కోట్ల నిధులు రావాల్సి ఉందని చెప్పారు. ఒక మంత్రిగా నగర సమస్యలను పరిష్కరించడంతో పాటు సనత్‌నగర్ నియోజకవర్గానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి పనులు చేపడుతున్నామని తెలిపారు. నియోజకవర్గంలోని వివిధ కాలనీలు, అపార్టుమెంట్ల అసోసియెషన్లతో సమావేశాలు ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టామని వారి సమస్యల పరిష్కారం కోసం ఇదో వేదిక అవుతుందని తెలిపారు. ముందుగా 5వ తేదిన పద్మారావునగర్ డివిజన్‌లో ఉదయం 10 గంటలకు కాలనీలు, అపార్టుమెంట్ల అసోసియెషన్ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని వివిధ విభాగాల అధికారులను కూడా అక్కడికి రప్పించి సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తున్నానని వెల్లడించారు. కాగా ఒక్కొక్క డివిజన్‌లో ఒక్కొరోజు ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నమని, అసోసియేషన్లు లేని కాలనీలు అపార్టుమెంట్ వాసులు త్వరతగతిన అసోసియేషన్లు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. అలాగే సనత్‌నగర్ నియోజకవర్గంకు ఈ వారం రోజుల్లో జిహెచ్‌ఎంసి కమీషనర్ పిలిపించి పర్యటించడం జరుగుతుందని, బన్సిలాల్‌పేటలో మూత పడిన బావిని కాకతీయ మిషన్ ద్వారా అందుబాటులోకి తేవడం, మేకలబండ, విక్టోరియా కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం కోసం పరిశీలించనున్నట్లు చెప్పారు. బల్కంపేట బిజెఆర్ నగర్ స్మశానవాటిక అభివృద్ధి, సనత్‌నగర్ ఎంసిహెచ్ గ్రౌండ్‌ను ఇండోర్ లేదా ఓపెన్ స్టేడియం నిర్మాణం చేపట్టాలా ప్రజలను అడిగి నిర్మాణం చేయిస్తామని తెలిపారు. శ్యామలకుంటలో మంచినీటి సమస్య పరిష్కరానికి కోటి రూపాయల వ్యయం, బికె గూడలోని పార్కు అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సనత్‌నగర్‌లో 40 వరకు పార్కులు ఉన్నాయని హరిత వనం ద్వారా పార్కులను అభివృద్ది చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అన్నారు. నిధుల కోసం ఎదురుచూడకుండా ప్రజా సమస్యలపై అధిక ప్రాధాన్యతను ఇచ్చి అభివృద్ది పనులు చేపట్టడమే తన ముందున్న లక్ష్యమని తెలిపారు. వివిధ విబాగాల అధికారుల మధ్య సమన్వయం లేక గతంలో రెండు నెలలు చేసే పనులకు సంవత్సరాలు పట్టేదని ప్రస్తుతం వివిధ విభాగాల అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయ పరుస్తూ అభివృద్ది పనుల విషయంలో నిర్లక్ష్యం వహించకుండా చూస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచన నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు పెద్ద పెద్ద ప్రాజెక్ట్‌లు చేపట్టాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నారని, అదేవిధంగా బస్తీలు, కాలనీలు అభివృద్ది చెందాలనే దిశగా అడుగు వేస్తుండటంతోనిధుల కోసం ఆలోచించకుండా అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నారని తెలిపారు. కృష్ణ ఫేజ్ 3 పనులు పూర్తి అయి నగరానికి మంచినీటి సరాఫరాకు సిద్దంగా ఉందని నీటి సరఫరా జరిగితే మంచినీటి సమస్య ఉండదని అన్నారు. దేవాలయాలు, మజీద్‌లు, చర్చిల అభివృద్దికి పాటు పడుతున్నామని అన్నారు. త్వరలో సనత్‌నగర్‌లోని పలు బస్తీలలో ముఖ్యమంత్రి పర్యటన ఉంటుందని చెప్పారు. సనత్‌నగర్ నియోజకవర్గంలో ప్రజలకు ఏ సమస్య వచ్చిన, ఉన్న వెంటనే తన సెల్ నంబర్లకు ఫోన్ చేస్తే చాలు సమస్య పరిష్కరించి మళ్లీ మీకు ఫోన్ చెయ్యడం జరుగుతుందని మంత్రి తెలిపారు. తన సెల్ నంబర్లు 98480 98166, 98480 21665, 95505 580590 లకు ఫోన్ చేస్తే చాలు సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసాయని ఇక ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గాన్ని నగరానికే రోల్ మోడల్‌గా తయారు చేయ్యడం నా లక్ష్యమని తెలిపారు. సమస్యపై ఫోన్ చెయ్యండి సమస్యను పరిష్కరించుకోండని ప్రజలను కోరారు. సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి ఉప్పల్, మార్చి 29: ప్రజాసమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని మల్కాజిగిరి ఎంపి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆదివారం బోడుప్పల్ గ్రామంలోని అశోక్‌నగర్, లక్ష్మీనగర్, శ్రీలక్ష్మీనగర్‌లో సిసి రోడ్డు, ప్రాధమిక ఉపకేంద్రం, కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. ముఖ్యంగా నీటి ఎద్దడి నివారణకోసం ఎన్ని నిధులు ఇవ్వడానికైనా వెనుకాడనని పేర్కొన్నారు. మేడ్చెల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ నగర శివారు గ్రామాల్లో నీటి సరఫరా బాధ్యతలను జలమండలికి అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఇప్పటికే బోడుప్పల్, పీర్జాదిగూడ గ్రామాల్లోని కొన్ని కాలనీలలో నీటిని సరఫరా చేయడానికి ట్రయల్ రన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కృష్ణా ఫేస్-3 పైపులైన్లు పూర్తయితే మిగితా గ్రామాల్లో దినం విడిచి దినం సరఫరా చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటీసి సభ్యుడు మంద సంజీవరెడ్డి, ఎంపిటీసి సభ్యులు దేవరకొండ వీరాచారి, తోటకూర చందర్‌యాదవ్, అశోక్‌యాదవ్, జంగమ్మ, శారద, శోభ, టిడిపి, టిఆర్‌ఎస్ నేతలు, అధికారులు పాల్గొన్నారు. శ్రీలక్ష్మీనగర్‌లో స్వాగత ఏర్పాట్లలో ఎంపి, ఎంపిపి, ఎంపిటీసి సభ్యుల పేర్లు లేకపోవడం పట్ల కాలనీ అసోసియేషన్ తీరుపై టిడిపి ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. అలరించిన నృత్య, సంగీత ప్రదర్శన గచ్చిబౌలి, మార్చి 29: సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో జరుగుతున్న నృత్య సంగీత ప్రదర్శన శిల్పారామం సందర్శకులను అలరించింది. ఈశాన్య రాష్ట్రాల కళాకారులు తమ ప్రతిభతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసారు. దోలిదాస్ జానపద పాటలు, అస్సాం సత్తియ సంగీత మహా విద్యాలయ సాంప్రదాయ పాటలు, ముకుల్ రాభ బోడో నృత్యాలు ఆకట్టుకున్నాయి. మిజోరం పంచుగా వర్సిటీ విద్యార్థుల డాన్స్, మణిపూర్ విద్యార్థుల నృత్యం, అగర్తలా కళాకారుల బొల్‌గాన్, మణిపురివారి దొల్‌చోలం, ఆదిలాబాద్ జానపద కళాకారుల గోండ్ నృత్యం ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. దీంతోపాటు హస్తకళా ప్రదర్శనకు సందర్శకులు పోటెత్తారు. కళాకారులను శిల్పారామం ప్రత్యేక అధికారి జ్ఞాపికలతో సన్మానించారు. ఘనంగా శ్రీ సచ్చిదానంద కళాపీఠం వార్షికోత్సవాలు కాచిగూడ, మార్చి 29: శ్రీ సచ్చిదానంద కళాపీఠం నవమ వార్షికోత్సవ సంబరాలు అదివారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మభూషణ్ డా. సి.నారాయణరెడ్డి విచ్చేసి మాట్లాడుతూ సచ్చిదానంద కళాపీఠం విద్యార్థులను ప్రోత్సహిస్తు వారికి చేయూతను అందించడం ఎంతో అభినందనీయమన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తు ప్రజల నుంచి ఎంతో ఆదరణను పొందుతుందని కొనియాడారు. సభకు ముందు బాల తరుణ సచ్చిదానందం చిన్నారులచే ఆలాపన గీతలహరి అందరిని అలరించాయి. ఈ సందర్భంగా దూరదర్శన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మల్లాది శైలజ సుమన్‌ను ఘనంగా సత్కరించారు. ప్రముఖ రచయిత్రి డా. గురజాడ శోభాపేరిందేవి సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో వివిధ సంస్థల ప్రముఖులు సాలూరి వాసురావు, మదన్ మోహన్, మహ్మద్ రఫీ, డా. మంగళగిరి ప్రమీలాదేవి, త్రినాథరావు, ఆకెళ్ళ పార్వతి, రామకృష్ణ, అధ్యక్షుడు రత్నాకర శర్మలు పాల్గొన్నారు. అక్రమ నీటి వ్యాపారాన్ని అరికట్టండి ఉప్పల్, మార్చి 29: కాచివానిసింగారంలో అక్రమ నీటి వ్యాపారాన్ని అరికట్టాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు ఆదివారం ప్రధాన రహదారిలో ఆందోళన చేశారు. యువకులు పురవీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. నీటిని తరలించే ట్యాంకర్లను అడ్డుకుని వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం టెంట్ వేసుకుని బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఉదయం నుండి రాత్రి వరకు కొనసాగిన ఆందోళనకు పలువురు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. గ్రామంలోని గడ్డిపొలాల్లో ఎక్కడబడితే ప్రైవేటు స్థలాల్లో రాజకీయ పలుకుబడి కల్గిన కొందరు వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా బోర్లు వేసి ట్యాంకర్ల ద్వారా అక్రమంగా నీటి వ్యాపారం చేయడం వల్ల పరిసర ప్రాంతాలలోని బోర్లలో భూగర్భ జలాలు అడుగంటిపోయి నీటి సమస్య తీవ్రమైందని వాపోయారు. అక్రమ నీటి వ్యాపారాన్ని అరికట్టాలని సంబంధిత రెవెన్యూ అధికారులకు అనేక సార్లు మొరపెట్టుకున్నా స్పందన కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అక్రమ నీటి వ్యాపారాన్ని అరికట్టకపోతే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని వారు హెచ్చరించారు. అక్రమ నీటి తరలింపుపై అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో మాజీ సర్పంచ్ ఎం.ముత్యాలుగౌడ్, వార్డు సభ్యులు శ్రీదేవి, రాజ్‌కుమార్, శ్రీనివాస్, గ్రామస్థులు పాల్గొన్నారు. ఆందోళనకారులపై కేసులు ఇదిలా ఉండగా అక్రమ నీటి వ్యాపారాన్ని అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన గ్రామస్థులు కొందరు బోర్లపై దాడిచేసి పైపులు, ఇతర పరికరాలు, విలువైన ఆస్తులను ధ్వంసం చేశారని పోలీసులకు స్థానికుడు రంజిత్‌రెడ్డి ఫిర్యాదు చేశారని ఎస్‌ఐ జానీ తెలిపారు. విచారణ జరిపి ఫిర్యాదుపై విలువైన పైపులు, ఇతర పరికరాలు ధ్వంసం చేశారన్న అభియోగంపై మాజీ సర్పంచ్ ముత్యాలు, వార్డు సభ్యులు శ్రీదేవి, రాజ్‌కుమార్, శ్రీనివాస్ ఇతరులైన బస్వరాజ్, మహేందర్, పవన్‌కుమార్, శ్యాంసుందర్‌లపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జానీ తెలిపారు.

COMMENTS

పేరు

Adilabad AUDIO RELEASES ENTERTAINMENT GOSSIPS Health HYDERABAD INTERNATIONAL Job Search Jobs KARIMNAGAR KHAMMAM MAHABOOBNAGAR MEDAK MOVIE REVEWS NALGONDA NATIONAL NIZAMABAD Rangareddy SINGARENI NEWS TECHNOLOGY TELANGANA NEWS VIDEO SONGS WARANGAL worldcup2015
false
ltr
item
Tdaily.In - Telangana News: ఫోన్ కొట్టండి సమస్యలను పరిష్కరించుకోండి
ఫోన్ కొట్టండి సమస్యలను పరిష్కరించుకోండి
http://1.bp.blogspot.com/-LJfS8YQvvyo/VRiHU2bk3PI/AAAAAAAAEpM/SYi_oOEevv8/s1600/INDIA_-_foto_e_censura.jpg
http://1.bp.blogspot.com/-LJfS8YQvvyo/VRiHU2bk3PI/AAAAAAAAEpM/SYi_oOEevv8/s72-c/INDIA_-_foto_e_censura.jpg
Tdaily.In - Telangana News
https://telugunewvideos.blogspot.com/2015/03/blog-post_928.html
https://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/2015/03/blog-post_928.html
true
2091677902228022841
UTF-8
Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS CONTENT IS PREMIUM Please share to unlock Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy