-హైదరాబాద్ వస్తుండగా దుద్దెడ వద్ద రోడ్డు ప్రమాదం కొండపాక: కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్, టీఆర్ఎస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు తుల ...
-హైదరాబాద్ వస్తుండగా దుద్దెడ వద్ద రోడ్డు ప్రమాదం
కొండపాక: కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్, టీఆర్ఎస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు తుల ఉమకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది.
మంగళవారం టీఆర్ఎస్ నేత హరిచరణ్, గన్‌మెన్ రమేశ్, అటెండర్ రమేశ్, డ్రైవర్ సీహెచ్ శ్రీనివాస్‌తో కలిసి ఆమె ఇన్నోవా కారులో కరీంనగర్ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. రాజీవ్హ్రదారిపై మెదక్ జిల్లా దుద్దెడ టోల్గేట్ దాటగానే, చౌరస్తా వద్ద వీరి వాహనాన్ని హైదరాబాద్ నుంచి సిద్దిపేట వైపుకు వస్తున్న స్విఫ్ట్ కారు ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ఉన్న సిద్దిపేట జెడ్పీటీసీ సభ్యులరాలు గ్యార వజ్రవ్వ భర్త యాదగిరి, బక్రిచెప్యాల వార్డు సభ్యుడు రఘురాములు తీవ్రంగా గాయపడ్డారు. వెనుకాలే వచ్చిన ఇండికా సైతం స్విఫ్ట్‌ను ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. తుల ఉమ, గన్‌మెన్ రమేశ్, అటెండర్ రమేశ్, హరిచరణ్లు స్వల్పగాయాలతో బయటపడగా సిద్దిపేటలో చికిత్స అందించారు.
Key Tags
Uma Tula ,Karimnagar zp Chairperson