ఆదిలాబాద్ పట్టణం: జిల్లాపరిషత్ ముఖ్య కార్యనిర్వహణ ఇన్‌ఛార్జి అధికారి నియామకం రోజుకో మలుపు తిరుగుతూ రసవత్తరంగా మారుతోంది. ప్రస్తుతం ఆది...
ఆదిలాబాద్ పట్టణం: జిల్లాపరిషత్ ముఖ్య కార్యనిర్వహణ ఇన్‌ఛార్జి అధికారి నియామకం రోజుకో మలుపు తిరుగుతూ రసవత్తరంగా మారుతోంది. ప్రస్తుతం ఆదిలాబాద్ ఎంపీడీఓ జితేందర్‌రెడ్డి ఇన్‌ఛార్జి సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తుండగా ఆ స్థానంలో తాజాగా జన్నారం ఎంపీడీఓకు బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యం సంతరించుకుంది. జిల్లా రాజకీయాల్లోనూ ఇది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఇన్‌ఛార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న జితేందర్‌రెడ్డికి పట్టుబట్టి పోస్టింగ్ ఇప్పించిన జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఈ తాజా ఉత్తర్వులతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. మరోపక్క జిల్లాపరిషత్ అధ్యక్షురాలు శోభారాణి సైతం తాజా ఉత్తర్వుల పట్ల అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది.చీ/్డ్న్థ్మజి చ్డ్న్థ్మీ ్బై్శ్ఠ=ఖి+2ఖిజిజిల్లాపరిషత్ సీఈఓ నియామకం మొదటినుంచి అనేక మలుపులు తిరుగుతోంది. మొన్నటివరకు సీఈఓగా పనిచేసిన అనితాగ్రేస్ ఏడాది పదవికాలం ఫిబ్రవరి 26న ముగిసింది. ఈ పదవిలో తమకు సంబంధించిన వ్యక్తిని నియమించాలనే వ్యూహంతో ఉన్న జిల్లాకు చెందిన మంత్రులు జోగురామన్న, ఇంద్రకరణ్‌రెడ్డిలు ఆదిలాబాద్ ఎంపీడీఓ జితేందర్రెడ్డిపేరుని తెరపైకి తెచ్చి జడ్పీలో ఇన్‌ఛార్జి అకౌంట్ అధికారిగా పనిచేస్తున్న ఆయనకు ఇన్‌ఛార్జి డిప్యూటీ సీఈఓ బాధ్యతలు తొలుత ఇప్పించారు. ఈ బాధ్యతలకోసం సీఎం కార్యాలయం నుంచి కూడా జిల్లాపాలనాధికారికి మౌఖికంగా ఆదేశాలు వచ్చాయని ప్రచారం జరిగింది. ఫిబ్రవరి 26న సీఈఓ అనితాగ్రేస్ పదవీకాలం ముగియడంతో ఆ తర్వాత కొత్త సీఈఓకోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందని ఎదురుచూశారు. మంత్రుల ఒత్తిడిమేరకు మార్చి 10వతేదిన డిప్యూటీ సీఈఓగా ఉన్న జితేందర్‌రెడ్డికే జిల్లాపాలనాధికారి ఇన్‌ఛార్జి సీఈఓగా బాధ్యతలు అప్పగించారు.చీ/్డ్న్థ్మజి చ్డ్న్థ్మీ ్బై్శ్ఠ=ఖి+2ఖిజిజన్నారం ఎంపీడీఓగా పనిచేస్తున్న శేషాద్రికి జడ్పీ సీఈఓగా పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరి జె.రేమండ్ పీటర్ జి.ఒ.నం.203 పేరిట శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. జితేందర్‌రెడ్డి తనకంటే జూనియర్ అని శేషాద్రి గతంలోనే జిల్లాపాలనాధికారికి ఫిర్యాదుచేశారు. తాజాగా ప్రభుత్వ స్థాయిలోనూ ఫిర్యాదు చేయడంతో పరిశీలించిన ఉన్నత అధికారులు ఆయన్ని నియమిస్తూ ఈ ఉత్తర్వులు జారీచేసినట్లు తెలుస్తోంది. కాగా ఇదివరకు పనిచేసిన అనితాగ్రేస్ను కొత్తఉత్తర్వులు వచ్చేవరకు కొనసాగించాలని ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరి జె.రేమండ్‌పీటర్ గతంలోనే జిల్లాపాలనాధికారికి చరవాణిలో చెప్పినట్లు ప్రచారం జరిగింది. అయితే మంత్రుల ఒత్తిడితో జిల్లాపాలనాధికారి మాత్రం కొత్తఉత్తర్వులకోసం ఎదురుచూడకుండా ఇన్‌ఛార్జి డిప్యూటీ సీఈఓగా ఉన్న జితేందర్‌రెడ్డికి హడావిడిగా ఇన్‌ఛార్జి సీఈఓగా బాధ్యతలు అప్పగించారు. దీంతో జిల్లాపాలనాధికారి జగన్మోహన్, రేమండ్ పీటర్ల మధ్య స్వల్పవిభేదాలు తెచ్చినట్లు ప్రచారం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో జన్నారం ఎంపీడీఓ శేషాద్రి తాను జిల్లాలో సీనియరనని తనకు బాధ్యతలు ఇవ్వకుండా తన జూనియర్‌కు ఇచ్చారని రేమండ్‌పీటర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. మంత్రి కేటీఆర్ దగ్గరి బంధువు సహకారంతోనే శేషాద్రి ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు వివరించినట్లు సమాచారం. దీంతోనే శుక్రవారం రేమండ్ పీటర్ నుంచి ఉత్తర్వులు జారీ అయినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో జితేందర్‌రెడ్డికి 10.02.2015న ఇన్‌ఛార్జి డిప్యూటీ సీఈఓగా జిల్లాపాలనాధిµకారి ఇచ్చిన ఉత్తర్వులను రద్దుచేసి ఈ కొత్తఉత్తర్వులను జారీ చేస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.చీ/్డ్న్థ్మజి చ్డ్న్థ్మీ ్బై్శ్ఠ=ఖి+2ఖిజిజన్నారం ఎంపీడీఓ శేషాద్రిని జడ్పీ సీఈఓ( ఫుల్అడిషనల్ఛార్జి)గా నియమిస్తు ఉత్తర్వులు జారీఅయిన విషయం చాలామందిలో హడావిడి కలిగించింది. విషయం తెలియగానే ఇన్‌ఛార్జి సీఈఓ జితేందర్‌రెడ్డితోపాటు ఆయనకు సన్నిహితులైన మెప్మా పీడీ రాజేశ్వర్ రాఠోడ్, తాంసి ఎంపీడీఓ భూమయ్యలు ఆదిలాబాద్‌లోనే ఉన్న జడ్పీ అధ్యక్షురాలు శోభారాణి భర్త సత్యనారాయణ గౌడ్‌ను కలిశారు. ఆయన కూడా జితేందర్‌కు పూర్తిమద్దతు తెలిపినట్లు సమాచారం. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు సైతం ఈ ఉత్తర్వుల విషయం తెలిసి నివ్వెరపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఓ మంత్రి ఈ విషయంపై ముఖ్యమంత్రితోనూ చరవాణిలో మాట్లాడినట్లు తెలిసింది. మరోపక్క శేషాద్రి సీఈఓగా బాధ్యతలు తీసుకునేందుకు వస్తే ఆయన్ని విధుల్లోకి తీసుకోవద్దని పాలనాధికారికి కూడా ఓ మంత్రి ఆదేశాలిచ్చినట్లు సమాచారం. మొత్తంమీద కొత్త సీఈఓ నియామకం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
