-దుమ్ము. ధూళితో నష్టపోతున్నాం -సబ్‌కలెక్టర్‌కు రేచిని గ్రామస్తుల మొర తాండూరు : కోల్‌యార్డుల వల్ల పంటలు నష్టపోతున్నాం. దుమ్ము, ధూళీ వల్ల ర...
-దుమ్ము. ధూళితో నష్టపోతున్నాం
-సబ్‌కలెక్టర్‌కు రేచిని గ్రామస్తుల మొర
తాండూరు : కోల్‌యార్డుల వల్ల పంటలు నష్టపోతున్నాం. దుమ్ము, ధూళీ వల్ల రోగాల బారిన పడుతున్నాం. రోడ్డు ప్రమాదాలు జరిగి, ప్రాణన ష్టం జరుగుతోంది. కోల్‌యార్డులను ఎత్తేయండి అంటూ ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతుకు స్థానిక గ్రామస్తులు, నాయకులు మొ రపెట్టుకున్నారు. రేచిని రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలోని కోల్‌యార్డులను శుక్రవారం రాత్రి సబ్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, కంపెనీకి సంబంధించిన పత్రాలను పరిశీలించారు. ఈసందర్భంగా గ్రా మస్తులు, నాయకులు ఆయనకు పలు సమస్యల ను విన్నవించారు. కోల్యార్డులతో పంటలు నష్టపోతున్నామని, ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని, దుమ్ము, ధూళీతో రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామస్తులతో సమావేశం..
రేచిని రోడ్, బోయపల్లి బోర్డు, వేణునగర్, కాసిపేట, ద్వారకాపూర్ గ్రామస్తులు, సీపీఐ నాయకు లు, స్వచ్చంద సంస్థలు గతంలో ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అ ప్పటి సబ్ కలెక్టర్ బాలాజీ దిగంబర్, కోల్‌యార్డుల పై విచారణ చేపట్టి నివేదిక అందజేయాలని తాండూర్ తహసీల్దార్ జాడి రాజేశ్వర్‌ను ఆదేశించారు. ఆ తహసీల్దార్ బదిలీ కాగా, కొత్తగా వచ్చిన తహసీల్దార్ మేకల మల్లేశ్ కోల్‌యార్డు యాజమానులందరికీ, గ్రామస్తులకు, సీపీఐ నాయకులకు, స్వచ్ఛంద సంస్థల వారికి నోటీసులు జారీ చేసి సమావేశం ఏర్పాటు చేశారు. కోల్‌యార్డు యజమానులను తమకున్న అర్హత పత్రాలను చూపించాలని తహసీల్దార్ కోరగా ఎనిమిది రకాల అర్హత పత్రాలు ఏ ఒక్క కోల్‌యార్డు నిర్వహకుడి వద్ద లేవని తేలడంతో తహసీల్దార్ మేకల మల్లేష్ ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్‌కు, జిల్లా కలెక్టర్‌కు నివేదికలు పంపారు. ఈ విషయమై స్పందించిన ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు శుక్రవారం రాత్రి అన్ని కోల్యార్డుల్లోలో తనిఖీలు నిర్వహించారు. ఈయన వెంట తహసీల్దార్ మేకల మల్లేశ్, ఆర్ఐ వామన్‌రావు, వీఆర్వోలు, సీపీఐ నాయకులు, రేచిని రోడ్ రైల్వే స్టేషన్ గ్రామ ప్రజలు తదితరులున్నారు.