పెరిగిన విద్యుత్ చార్జీలు

ఆదిలాబాద్ : విద్యుత్ శాఖ తమ సంస్థ లోటును పూడ్చుకునేందుకు వినియోగదారులపై అదనపు చార్జీల భారం మోపుతూ నిర్ణయం తీసుకుంది. ఎన్‌పిడి సి ఎల్ ప్ర...

ఆదిలాబాద్ : విద్యుత్ శాఖ తమ సంస్థ లోటును పూడ్చుకునేందుకు వినియోగదారులపై అదనపు చార్జీల భారం మోపుతూ నిర్ణయం తీసుకుంది. ఎన్‌పిడి సి ఎల్ ప్రతిపాదనలకు విద్యుత్ రెగ్యులేటరి కమిషన్ ( ఈ ఆర్సీ) ఆమోదం తెలపడంతో ఏప్రిల్ 1 నుండి విద్యుత్ చార్జీల భారం పడనుంది. వినియోగదారులకు ప్రతి ఏటా అదనంగా 40 కోట్ల భారం పడుతుండగా, గృహావినియోగదారులు 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడితే మాత్రం ఈ చార్జీల పెంపు నుండి మినహించారు. ప్రస్తుతం వస్తున్న కరెంటు చార్జీలను భరించలేక ఇబ్బందులు పడుతున్న విద్యుత్ వినియోగదారులకు ములిగే నక్కపై తాటిపండు పడ్డట్లయింది. జిల్లా వ్యాప్తంగా వివిధ కేటాగిరిలకు సంబంధించి 6,44,151 విద్యుత్ కనెక్షన్లు ఉండగా, అందులో 5,10,695 గృహసంబంధిత కనెక్షన్లు ఉన్నాయి. పరిశ్రమలకు 3420, వ్యవసాయ కనెక్షన్లు 1,30,036 కనెక్షన్లు ఉండగా, ప్రతి నెల 125 మిలియన్ యూనిట్ల నుండి 140 మిలియన్ యూనిట్ల విద్యుత్ వాడకం కొనసాగుతోంది. రోజుకు సగటున 4 మిలియన్ యూనిట్ల విద్యుత్ వాడకంలో ఉండడంతో సంస్థకు ఈ భారం తడిసి మోపెడవుతుంది. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి తగ్గుముఖం పట్టి, డిమాండ్ విఫరీతంగా పెరగడంతో తమ నష్టాలను పూడ్చుకునేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో విద్యుత్ చార్జీలు పెంచాల్సి వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. 200 యూనిట్ల లోపు వాడే వినియోగదారులకు మాత్రం రెగ్యులేషన్ కమిషన్ మాత్రం కనికరం చూపింది. వ్యవసాయ రంగం మినహించి, పరిశ్రమలు, వ్యాపార వాణిజ్య సముదాయాలు, వాటర్ వర్క్స్, కార్పొరేషన్లలలో, మున్సిపాలిటీ, పంచాయతీల్లో విద్యుత్ చార్జీల భారం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ప్రభుత్వం రైతులు, సామాన్య వినియోగదారులను చూడకుండా ఏకపక్షంగా విద్యుత్ చార్జీలు పెంచడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. స్వైన్‌ప్లూ బారిన పడి ఇంటర్ విద్యార్థిని మృతి *చికిత్స పొందుతూ 'గాంధీ'లో మృతి కౌటాల, మార్చి 27: స్వైన్‌ప్లూ మహమ్మారి విద్యార్థిని బలిగొన్న సంఘటన శుక్రవారం వెలుగుచూసింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్ళితే మండల కేంద్రానికి చెందిన సొంటకె గీత (18) అనే విద్యార్థి గత పది రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆమెను స్థానికంగా చికిత్స చేయించినా ఫలితం లేకపోవడంతో తండ్రి గోమాజి, ఇతర బంధువులు చికిత్స కోసం కాగజ్‌నగర్‌కు తరలించారు. అక్కడి వైద్యులు పరిస్థితిని గమనించి స్వైన్‌ప్లూ అని ప్రాథమికంగా నిర్ద్ధారించి మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ లేదా హైదరాబాద్‌కు వెళ్లాలని సూచించారు. దీంతో ఆందోళన చెందిన కుటుంబీకులు బిడ్డకు కాపాడుకోవాలన్న ఆత్రూతతో హైదరాబాద్‌కు తీసుకెళ్ళి గాంధీ ఆసుపత్రిలో చేర్చారు. ఈ తరుణంలో ఆమె పరిస్థితి మరింత విషమంగా మారింది. నాలుగు రోజులుగా కోమాలో ఉన్న గీత గురువారం మధ్యాహ్నం గాంధీ ఆసుపత్రిలో మృతి చెందింది. ఈ మేరకు కుటుంబీకులు బంధువుల సహాయంతో శుక్రవారం ఉదయం తమ స్వస్థలమైన కౌటాల గ్రామ పంచాయతీ నదీమాబాద్‌కు తీసుకవచ్చి విద్యార్థికి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా స్వైన్‌ప్లూతో మృతి చెందిన గీత మండల కేంద్రంలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ బైపిసి రెండవ సంవత్సరం చదువుతూ ఇటీవల వార్షిక పరీక్షల్లో మూడు పరీక్షలను రాసిన అనంతరం అస్వస్థతకు గురికావడంతో మిగిలిన పరీక్షలు రాయకుండానే ఆసుపత్రిలో మృతి చెందడం పట్ల తోటి విద్యార్థులు, అధ్యాపకులు దిగ్భ్రాంతి చెందారు. ఇదిలావుంటే స్వైన్‌ప్లూ బారిన పడి విద్యార్థి మృతి చెందిన విషయం తెలుసుకున్న కౌటాల వైద్య సిబ్బందితో పాటు హోమియో వైద్యుడు నాగరాజు వైరెగాడె, అసిస్టెంట్ శ్రీనివాస్‌లు కుటుంబీకులతో పాటు పరిసర ప్రాంత ప్రజలకు స్వైన్‌ప్లూ నివారణ మందులను అందజేశారు. నదీమాబాద్‌లో భయం..్భయం..... పట్టణాల్లో స్వైన్‌ప్లూ విజృంభిస్తూ ప్రజల ప్రాణాలను బలిగొంటుందని పత్రికలు, టివిల్లో చూసి ఒకింత భయాందోళనకు గురయ్యే ప్రజలకు తమ మధ్య ఉన్న అమ్మాయికి స్వైన్‌ప్లూ సోకి మృతి చెందిన ఘటన మరింత ఆందోళన పరుస్తుంది. మండల కేంద్రానికి ఆనుకుని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కూతవేటు దూరంలోని నదీమాబాద్‌లో ఇంటర్ విద్యార్థి గీత మృతి చెందిన ఘటనపై తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అనునిత్యం తమతో కలిసి ఉండే గీతకు సోకిన వ్యాధి ప్రాణాంతకం కావడంతో తాము కూడా పరీక్షలు చేయించుకోవాలన్న అభిప్రాయాన్ని పరిసర ప్రాంత ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించాలని ఈ సందర్భంగా వారు పేర్కొంటున్నారు. మండల కేంద్రంతో పాటు మరిన్ని గ్రామాల్లో కూడా స్వైన్‌ప్లూ మరణ వార్త ఒక్కసారిగా భయాందోళనలు రేకెత్తించింది. ఇప్పటికైన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

COMMENTS

పేరు

Adilabad AUDIO RELEASES ENTERTAINMENT GOSSIPS Health HYDERABAD INTERNATIONAL Job Search Jobs KARIMNAGAR KHAMMAM MAHABOOBNAGAR MEDAK MOVIE REVEWS NALGONDA NATIONAL NIZAMABAD Rangareddy SINGARENI NEWS TECHNOLOGY TELANGANA NEWS VIDEO SONGS WARANGAL worldcup2015
false
ltr
item
Tdaily.In - Telangana News: పెరిగిన విద్యుత్ చార్జీలు
పెరిగిన విద్యుత్ చార్జీలు
http://2.bp.blogspot.com/-pr4Kdp0Xjm4/VRc90fcu2bI/AAAAAAAAEnU/zJ_o8HwWTRQ/s1600/Electricity-rates-hike.jpg
http://2.bp.blogspot.com/-pr4Kdp0Xjm4/VRc90fcu2bI/AAAAAAAAEnU/zJ_o8HwWTRQ/s72-c/Electricity-rates-hike.jpg
Tdaily.In - Telangana News
https://telugunewvideos.blogspot.com/2015/03/blog-post_962.html
https://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/2015/03/blog-post_962.html
true
2091677902228022841
UTF-8
Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS CONTENT IS PREMIUM Please share to unlock Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy