హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం హాట్ హాట్ గా జరిగాయి. ప్రశ్నోత్తరాల సమయంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ సభ్యుల మధ్య మాటల ...
డీకె అరుణ.. అధికార పక్ష సభ్యులను నోరుమూసుకోండి అంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ సభ్యులు జోక్యం చేసుకోగా... నోర్ముసుకో..ఏం మాట్లాడుతున్నావ్...నోర్ముయ్...మహిళలతో మాట్లాడే పద్ధతి ఇదేనా.. మహిళలకు ఇచ్చే గౌరవం ఇలాగేనా... టీఆర్ఎస్ పార్టీలో మహిళలను నోరు మూపించేశారు మీరు అంటూ డీకె అరుణ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకుని మీ దాదాగిరి ఇక్కడ చెల్లదు...ఏమైనా ఉంటే మహబూబ్ నగర్ లో చూపించుకోండి అని అన్నారు.
