file photo from net - తెలంగాణ అర్చక సమాఖ్య అధ్యక్షుడు ఉపేంద్రశర్మ కాచిగూడ-హైదరాబాద్, మార్చి 17: రాష్ట్రంలో పనిచేస్తున్న అర్చకులకు ...
![]() |
| file photo from net |
- తెలంగాణ అర్చక సమాఖ్య అధ్యక్షుడు ఉపేంద్రశర్మ
కాచిగూడ-హైదరాబాద్, మార్చి 17: రాష్ట్రంలో పనిచేస్తున్న అర్చకులకు ఒకేసారి రెండు నెలల బకాయి వేతనాలు రూ.78.50 లక్షలు విడుదల చేయడం శుభపరిణామమని తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ అన్నారు. మంగళవారం కాచిగూడలో మీడియాతో ఉపేంద్రశర్మ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌కు అర్చకులు జీవితాంతం రుణపడి ఉంటారని అన్నారు.
ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో తెలంగాణలోని అర్చక పట్టభద్రులు దేవీప్రసాద్, పల్లా రాజేశ్వర్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. వీధినపడ్డ అర్చకులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ అనేక వరాలు ప్రకటించి చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయలేని సాహసాన్ని చేశారని ఆయన అన్నారు.
అర్చక సమాఖ్య సంఘానికి రూ.10 కోట్లు కేటాయించడం శుభపరిణామమన్నారు. రాష్ట్రంలోని 18 వందల దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు రూ.2500 నుంచి రూ.6 వేల వరకు వేతనాలు పెంచి అర్చకుల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. బడ్జెట్లో దేవాదాయశాఖకు పత్యేక బడ్జెట్, అలాగే అర్చకులకు సంక్షేమనిధికి రూ.320 కోట్లు కేటాయించాలని అయన కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షుడు భాస్కరభట్ల రామశర్మ, జీవీఎస్ శ్రీనివాస్‌చారి, జగన్మోహన్శర్మ, సత్యమోహన్, మల్లికార్జునశాస్త్రి తదితరులు పాల్గొన్నారు.
