-అత్యాధునిక యంత్రాలతో ఉత్పత్తి పెంపు లక్ష్యం -సంస్థ సీఎండీతో దక్షిణాఫ్రికా జాయ్ ప్రతినిధుల భేటీ హైదరాబాద్, : రాష్ట్ర విద్యుత్ అవసరాలకు ...
-అత్యాధునిక యంత్రాలతో ఉత్పత్తి పెంపు లక్ష్యం
-సంస్థ సీఎండీతో దక్షిణాఫ్రికా జాయ్ ప్రతినిధుల భేటీ
సింగరేణి బొగ్గు రవాణాలో రుద్రంపూర్ సీహెచ్‌పీ కంపెనీ రికార్డు సృష్టించింది. మరో వారం రోజుల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ఈ కంపెనీ (11 ర్యాక్‌ల) 42.350 టన్నుల బొగ్గును రవాణాచేసింది. సంస్థ మనుగడ కోసం అహర్నిశలు బాధ్యతాయుతంగా పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులను సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ సోమవారం టెలిఫోన్లో ప్రశంసించారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం రుద్రంపూర్ సీహెచ్‌పీ కార్మికులు, ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలోని కేకే - 5 గని కార్మికులకు ఆయన అభినందనలు తెలిపారు. మీ విజయం ఇతర గనుల్లోని ఉద్యోగులు, కార్మికులకు స్ఫూర్తినివ్వాలని పేర్కొన్నారు. కార్మికులను పేరుపేరునా పలుకరించి శభాష్. బాగా పనిచేశారు. మీ పనితీరు మాలో కొత్త ఉత్సాహాన్ని కలుగజేస్తున్నది. ఇలాగే పనిచేస్తూ ముందుకెళ్లండి. మీకు సంస్థ గుర్తింపు, గౌరవాన్ని ఇస్తుంది అని చెప్పారు. మందమర్రి కేకే - 5 గనిలో ఒకే షిఫ్టులో 110 టబ్బులను నింపిన కస్తూరి శంకర్‌ను, మరో షిఫ్ట్‌లో పోటా పోటీగా 150 టబ్బులు నింపిన ఆర్ రాజంను సీఎండీ శ్రీధర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ పోటీతత్వమే సంస్థను మరింత అభివృద్ధిలోకి తీసుకొస్తుందన్నారు.
-సంస్థ సీఎండీతో దక్షిణాఫ్రికా జాయ్ ప్రతినిధుల భేటీ
హైదరాబాద్, : రాష్ట్ర విద్యుత్ అవసరాలకు అనుగుణంగా సింగరేణి యాజమాన్యం భారీ ఉత్పత్తి లక్ష్యాలను నిర్దేశించుకున్నది. ప్రస్తుతం సంస్థకు 50 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం ఉన్నది. సమీప భవిష్యత్‌లో 80 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యాలను నిర్దేశించుకున్నది. అందులో భాగంగా సోమవారం దక్షిణాఫ్రికా ప్రముఖ మైనింగ్ యంత్రాల తయారీ కంపెనీ జాయ్ గ్లోబల్ కంపెనీ అండర్ గ్రౌండ్ మైనింగ్ - యురేషియా చీఫ్ మైనింగ్ ఇంజినీర్ అండ్రియన్ కార్లే, జాయ్ గ్లోబల్ ప్రతినిధి ప్రసాదరావు సింగరేణి సంస్థ సీఎండీ శ్రీధర్‌తో సమావేశమయ్యారు. సంస్థ కొత్తగా ఉత్పత్తిని ప్రారంభించే గనులకు అవసరమైన ఆధునిక టెక్నాలజీని, యంత్రాలను తాము సమకూర్చగలమని సింగరేణి సీఎండీ శ్రీధర్‌కు జాయ్ గ్లోబల్ ప్రతినిధులు చెప్పారు. అత్యాధునిక టెక్నాలజీతో తయారుచేసిన యంత్రాల పనితీరును వారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సంస్థ గనుల్లో షార్ట్‌వాల్, కంటిన్యూయస్ మైనర్ వంటి పరికరాల ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలని వారిని శ్రీధర్ కోరారు. కొత్తగూడెం వీ కే - 7 గనిలో కంటిన్యూయస్‌మైనర్ పనితీరును పరిశీలించి మరింత ఎక్కువ ఉత్పత్తికి సాధన అవకాశాలను వివరించాలన్నారు. ఇటీవల దక్షిణాఫ్రికాలో పర్యటించిన సింగరేణి సీఎండీ శ్రీధర్ జాయ్ గ్లోబల్ కంపెనీని కూడా సందర్శించి.. సంస్థ కొత్త మైనింగ్ ప్రతిపాదనలను వారికి వివరించారు. దాంతో సింగరేణి సామర్ధ్యాన్ని అన్ని కోణాల్లో అధ్యయనం చేసిన జాయ్ గ్లోబల్ సంస్థ తమ సేవలందించేందుకు ముందుకు రావడం గమనార్హం.
బొగ్గు రవాణాలో రుద్రంపూర్ రికార్డు