శ్రీరాంపూర్రూరల్: సింగరేణి సంస్థ 2014-15 ఆర్థిక సంవత్సరం శ్రీరాంపూర్ ఏరియాకు నిర్ధేశించిన వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించడ...
శ్రీరాంపూర్రూరల్: సింగరేణి సంస్థ 2014-15 ఆర్థిక సంవత్సరం శ్రీరాంపూర్ ఏరియాకు నిర్ధేశించిన వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించడం జరిగిందని శ్రీరాంపూర్ చీఫ్ జనరల్ మేనేజర్ సిహెచ్.వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారంఆయన విలేకరులతో మాట్లాడుతూ శ్రీరాంపూర్ ఏరియాకు నిర్ధేశించిన 5260000 టన్నుల ఉత్పత్తికి గాను మంగళవారం నాటికి 5278467 టన్నుల ఉత్పత్తి సాధించి వార్షిక లక్ష్యాన్ని అధింగమించడం జరిగిందని తెలిపారు. 7రోజులు ముందుగానే వార్షిక లక్ష్యం సాధించడానికి కృషి చేసిన కార్మికులు, ఉద్యోగులు, అధికారులు, టెక్నిషియన్లు, సూపర్వైజర్లు, కార్మికసంఘాల నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. అందరి సమిష్టి కృషితోనే లక్ష్య సాధన సాధ్యమైందని ఇదే స్పూర్తితో వచ్చే ఆర్థిక సంవత్సర లక్ష్య సాధనకు కృషిచేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొరతను అధిగమించాల్సిన తరుణంలో శ్రీరాంపూర్ ఏరియా లక్ష్యాన్ని చేరుకోవడం శుభపరిణామం అన్నారు. 2015-16 వార్షిక లక్ష్య సాధనకై ఏప్రిల్ నుండే ప్రయత్నిస్తే ఏలాంటి వ్యయప్రయాసలకు, ప్రమాదాలకు లోను కాకుండా లక్ష్యాన్ని చేరుకోవచ్చని తెలిపారు. ఉత్పత్తి లక్ష్య సాధనే కాకుండా ఉత్పత్తి ఖర్చును తగ్గించుకుంటూ రక్షణతో కూడిన ఉత్పత్తి తీయాలని కోరారు. ప్రస్తుత గ్లోబలైజేషన్ వ్యవస్థలో నాణ్యమైన బొగ్గు తక్కువ ధరకు లభిస్తున్న నేపథ్యంలో అదే విధంగా సింగరేణి బొగ్గును ఉత్పత్తి చేస్తేనే మార్కెట్లో పోటీని తట్టుకొని లాభాలు సాధించవచ్చని తద్వార ఉద్యోగుల జీతభత్యాలు, ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని తెలిపారు. కోట్లాధి రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటే ఉత్పత్తి వ్యయం తగ్గుతుందన్నారు.
