జిల్లాలో నకిలీ కరెన్సీ దందా మూడు పువ్వులు ఆరుకాయలుగా విరజిల్లు తోంది. అక్కడా, ఇక్కడా అనే తేడా లేకుండా బ్యాంకు ఏటీఎంలలో కూడా నకిలీ కరెన్స...
జిల్లాలో నకిలీ కరెన్సీ దందా మూడు పువ్వులు ఆరుకాయలుగా విరజిల్లు తోంది. అక్కడా, ఇక్కడా అనే తేడా లేకుండా బ్యాంకు ఏటీఎంలలో కూడా నకిలీ కరెన్సీ దర్శనమిస్తున్నాయి. రాజకీయ పార్టీల ముసుగు తొడుక్కున్న కొందరు నేతలు విదేశాల నుంచి చెల్లని నోట్లను గుట్టుగా జిల్లా కేంద్రానికి చేరవేస్తున్నారు. నిఘా వర్గాల కళ్లుగప్పి నకిలీ కరెన్సీని విచ్చలవిడిగా చలామణి చేస్తున్నారు. ప్రాంతాల వారీగా ఏజెంట్లను నియమించుకుని మరీ అక్రమ వ్యాపారాన్ని దర్జాగా చేస్తున్నారు. దీంతో సామాన్యుడి దగ్గర నుంచి బడా వ్యాపారుల వరకు నకిలీల వలలో చిక్కి విలవిల్లాడుతున్నారు. కాగా గురువారం నమస్తే తెలంగాణ దినప త్రికలో వచ్చిన రూ. 50వేలకు రూ. లక్ష అనే కథనం జిల్లాలో సంచలనం సృష్టిం చింది. నకిలీ నోట్లతో సంబంధమున్న వ్యక్తులు అండర్‌గ్రౌండ్‌లోకి వెళితే.. జిల్లా పోలీస్ బాస్ ఆదేశానుసారం బంగ్లాదేశ్ కేంద్రంగా జరుగుతున్న ఈ తంతుపై పోలీ సులు కూపీ లాగుతున్నారు.
ఖమ్మం జిల్లావ్యాప్తంగా నకిలీ కరెన్సీ హల్చల్ చేస్తోంది. తక్కువ కాలంలో ఆకాశానికి ఎగబాకాలని చూస్తున్న కొందరు నేతలు కాదు కాదు దొంగల పుణ్య మాని ఎక్కడ చూసినా చెల్లని నోట్లు దర్శనమిస్తున్నాయి. హోటల్స్, పెట్రోల్‌బంక్‌లు, బార్అండ్ రెస్టారెంట్స్ ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే పాన్ డబ్బా నుంచి అతిపెద్ద వ్యాపార సముదాయం వరకు నకిలీ కరెన్సీ రుచి చూడని వ్యాపారం లేదంటే అతిశయోక్తి కాదేమో. కొంతకాలం క్రితం వరకు పట్టణాలకే పరిమితమైన ఈ అక్రమ వ్యాపారం ప్రస్తుతం పల్లెలకు కూడా ఎగబాకింది. వారానికోసారి నిర్వహించే సంతల్లో సైతం దొంగనోట్ల వినియోగం విచ్చలవిడిగా సాగుతోంది. రెక్కల కష్టంపై బతుకులీడుస్తున్న నిరుపేదల చేతుల్లో, పండిన పంటను విక్రయించుకునేందుకు మార్కెట్‌కు వచ్చిన అన్నదాతల జేబుల్లో దొంగ నోట్లు దర్శనమిస్తున్నాయంటే జిల్లాలో నకిలీ కరెన్సీ వ్యాపారం ఏ విధంగా సాగుతోందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
-ఏటీఎంలే అడ్డాగా దొంగనోట్లు....
బ్యాంకులంటే ప్రతి ఒక్కరికీ నమ్మకం. వాటిల్లో ఎలాంటి పొరపాటు జరగదని ప్రతి ఒక్కరి విశ్వాసం. కానీ పలు బ్యాంకుల పేర్లతో వెలసిన ఏటీఎం సెంటర్లు మాత్రం దొంగనోట్లకు అడ్డాలుగా మారాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏటీఎంలలో నగదును అమర్చే ప్రక్రియను బ్యాంకర్లు ప్రయివేటు ఏజెన్సీలకు అప్పగించారు. దీంతో నకిలీ కరెన్సీయే వ్యాపారంగా బతుకుతున్న కొందరు వ్యక్తులు ఏజెన్సీలో డబ్బులు అమర్చే సిబ్బందికి పెద్ద ఎత్తున ఆశచూపి లోబర్చుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఇరువురి అంగీకారం నిమిత్తం అసలుకు బదులు దొంగనోట్లను అమర్చుతూ అక్రమ వ్యాపారానికి పాల్పడుతు న్నట్లు తెలిసింది. ఇటీవల కాలంలో ఏటీఎంలలోనూ దొంగనోట్లు విరివిగా దర్శనమిస్తున్నాయి. అసలు, నకిలీ రెంటికి మధ్యన తేడా తెలియని ఖాతాదారులు ఎప్పటి మాదిరిగా డబ్బును డ్రా చేస్తున్నారు. వాటిని వాడకంలోకి తీసుకువెళ్లగా ఎక్కడో ఒకచోట అవి నకిలీ కరెన్సీ అని బయటపడుతోంది. వాటిని తీసుకువెళ్లి సదరు బ్యాంకు అధికారులకు చూపిస్తుంటే తమకు సంబంధం లేదని చేతులె త్తేస్తున్నారు. నకిలీ కరెన్సీ ఏజెంట్లు కొందరు ఇలాంటి ఏజెన్సీల సిబ్బందితో మిలాఖత్ అయ్యి గుట్టు చప్పుడు కాకుండా నకిలీ కరెన్సీని ఏటీఎంలలోకి చేరుస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
-క్రికెట్ బెట్టింగ్‌ల్లోనూ దర్శనమిస్తున్న నకిలీ కరెన్సీ...
ప్రస్తుతం ప్రపంచకప్ క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. దీంతో జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌లు చాప కింద నీరులా జోరుగా సాగుతున్నాయి. క్రికెట్ బెట్టింగ్‌ల్లోనూ నకిలీ కరెన్సీ హవా నడుస్తోందని పలువురు పేర్కొంటున్నారు. ఇటీవల జరిగిన ఇండియా -పాకిస్తాన్, ఇండియా - సౌత్ ఆఫ్రికా మ్యాచ్‌లకు నగర శివారులో సంపన్నుల కాలనీగా పేరొందిన ఓ ప్రాంతంలో భారీగా క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహించారని వినికిడి. ఆ క్రికెట్ బెట్టింగ్‌ల్లోనూ అసలుకు బదులు నకిలీ కరెన్సీ దర్శనమివ్వడంతో బెట్టింగ్ బంగార్రాజులు లబోదిబోమంటున్నట్లు తెలిసింది. ఓ రాజకీయ పార్టీ కండువా కప్పుకున్న ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమారుడు, అతని మిత్రులు నకిలీ కరెన్సీ చలామణీలో కీలక సూత్రదారులుగా ఉన్నట్లు సమాచారం. నకిలీ కరెన్సీ చలామణీలో రాజకీయ పార్టీల నాయకులే కాదు, విలేకరుల ముసుగు వేసుకున్న కొందరు కూడా ఇదే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల భద్రాచలంకు చెందిన ఇద్దరు విలేకరులు వరంగల్ జిల్లాలో నకిలీ నోట్లతో సహా పట్టుబడటం తీవ్ర చర్చ నీయాంశమైంది.
-నమస్తే కథనంతో అండర్‌గ్రౌండ్‌కు అక్రమార్కులు..
దేశ సరిహద్దున ఉన్న బంగ్లాదేశ్ నుంచి నేరుగా ఖమ్మం జిల్లా కేంద్రానికి నకిలీ కరెన్సీ వస్తుందన్న విషయాన్ని గురువారం నమస్తే తెలంగాణ ప్రధాన సంచిక రూ. 50వేలకు రూ. లక్ష అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. బడావ్యాపారి నుంచి టీ స్టాల్ వ్యాపారి వరకు నకిలీ కరెన్సీ గు రించే చర్చించుకున్నారు. ప్రధానంగా నకిలీ కరెన్సీ వ్యాపారాన్ని గుట్టుగా సాగిస్తున్న పలు రాజకీయ పార్టీల నేతల వెన్నులో ఒణుకుపుట్టింది. ఇంకా ఇక్కడే ఉంటే పోలీసులు కుమ్మేస్తారని గ్రహించి ఉదయాన్నే అండర్‌గ్రౌండ్‌కు వెళ్లిపోయారు.
జిల్లాలోని ఓ పార్టీకి చెందిన యువనేత ఈ దందా ఆధారంగానే అతి తక్కువ కాలంలో ఆకాశానికి ఎదిగాడనేది అందరూ మాట్లాడుకుంటున్నారు. కొన్ని పార్టీల నేతలు, వారి అనుచరులు ఆ యువనేతపై బహిరంగ ఆరోపణలు కూడా చేసిన సంఘటనలు ఉన్నాయి. ఎప్పటినుంచో ఇతనిపై ఆరోపణలు వచ్చినా, వస్తున్నా పోలీసులు లోతుగా విచారణ సాగించలేదని విమర్శలు వస్తున్నాయి. బంగ్లాదేశ్ నుంచి జిల్లా కేంద్రానికి నకిలీ కరెన్సీని తీసుకురావడంలో ఇతడి నెట్వర్క్ చూసిన నిఘావర్గాలే ముక్కున వేలేసుకుంటున్నాయంటే అతిశయోక్తి కాదు.
-జిల్లా పోలీసు బాస్ సీరియస్....
జిల్లాలో నకిలీ నోట్ల చలామణీ వ్యవహారంపై జిల్లా ఎస్పీ షానవాజ్‌ఖాసీం కన్నెర్ర చేశారు. గురువారం పోలీసు అధికారులతో సమావేశమైన ఆయన వారి సబ్ డివిజన్ల పరిధిలో దొంగనోట్ల చలామణీ వ్యవహారంపై పూర్తి నివేదిక అందించాలని ఆదేశించారు. దొంగనోట్ల ముఠాలు , ఏజెంట్ల కార్యకలాపాలను తెలుసుకునేందుకు నిఘా వర్గాలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. గతంలో దొంగ నోట్ల చలామణీ, ముద్రణ జరిపిన నేరగాళ్లపై పోలీసులు కూపీ లాగుతున్నారు. జిల్లాకు నకిలీ కరెన్సీ చేరుకునే మార్గాల్లో పోలీసు తనిఖీలు ఎలా ఉన్నాయనే అంశంపై కూడా ఎస్పీ ప్రత్యేక దృష్టిసారించారు. ఇదేక్రమంలో దొంగనోట్ల ము ఠాలకు సహకరిస్తున్నారని పేరున్న పలువురు ఇంటి దొంగల వ్యవహారంపైనా ఆయన ప్రత్యేక దృష్టి సారించినట్లు నిఘావర్గాలు అంటున్నాయి.

48