Golden Peacock Award -20న దుబాయిలో స్వీకరించనున్న సీఎండీ హైదరాబాద్: సింగరేణి సంస్థ గోల్డెన్ పీకాక్ ఇన్నోవేటివ్ అవార్డు-2015కు ఎంపి...
![]() |
| Golden Peacock Award |
-20న దుబాయిలో స్వీకరించనున్న సీఎండీ
హైదరాబాద్: సింగరేణి సంస్థ గోల్డెన్ పీకాక్ ఇన్నోవేటివ్ అవార్డు-2015కు ఎంపికైంది. కోల్‌మైనింగ్ ఏరియాల్లో ఓపెన్‌కాస్ట్ గనులపై ఉన్న ఓవర్ బర్డెన్ రిమూవల్‌ను రికార్డు స్థాయిలో తొలగించడమే కాకుండా దానిని ప్రత్యామ్నాయ అవసరాలకు వినియోగిస్తున్నందుకుగాను సింగరేణికి ఈ అవార్డు దక్కింది. ఏప్రిల్ 20న దుబాయిలో జరిగే కార్యక్రమంలో దుబాయి సాంస్కృతిక, యువజన, సామాజిక అభివృద్ధిశాఖ మంత్రి షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్ చేతులమీదుగా సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ ఈ అవార్డును అందుకుంటారు.
