Anushka as Rudramadevi కాకతీయ సామ్రాజ్య ఖ్యాతిని జగద్విదితం చేసిన వీరనారి, అఖండ భారతదేశ చరిత్రలోనే మహోత్క్రష్టమైన పాలనగావించిన ధీశా...
![]() |
| Anushka as Rudramadevi |
కాకతీయ సామ్రాజ్య ఖ్యాతిని జగద్విదితం చేసిన వీరనారి, అఖండ భారతదేశ చరిత్రలోనే మహోత్క్రష్టమైన పాలనగావించిన ధీశాలి రాణిరుద్రమదేవి జీవితగాథ ఆధారంగా తెరకెక్కిస్తున్న చారిత్రక చిత్రం రుద్రమదేవి. స్వీయనిర్మాణ దర్శకత్వంలో గుణశేఖర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమాను వేసవికానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. భారతదేశపు తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ చిత్రంగా రుద్రమదేవి నిర్మాణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తినిరేకెత్తిస్తోంది.
ఇందులో గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇటీవలే విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోందని చిత్రబృందం తెలిపింది. కాగా సుప్రసిద్ధ సంగీత దర్శకుడు ఇళయరాజా స్వరపరచిన ఈ చిత్ర గీతావిష్కరణను ఏప్రిల్ 8న చారిత్రక వరంగల్కోటలో జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వేడుకలో చిత్ర ప్రధాన తారాగణమంతా పాల్గొంటారని సమాచారం. రానా, సుమన్, కృష్ణంరాజు, ప్రకాష్‌రాజ్, నిత్యామీనన్, ప్రభ, కేథరిన్, జయప్రకాష్‌రెడ్డి, ఆదిత్యమీనన్, ప్రసాదాదిత్య, అజయ్, వేణుమాధవ్, ఉత్తేజ్, వెన్నెల కిషోర్, శివాజీరాజా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, ఆర్ట్: పద్మశ్రీ తోట తరణి, కెమెరా: అజయ్‌విన్సెంట్, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, మాటలు: పరుచూరి బ్రదర్స్, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, ఫైట్స్: విజయ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె. రామ్‌గోపాల్, కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం: గుణశేఖర్.
