(15 Apr) హైదరాబాద్, ఏప్రిల్ 14 : బహిరంగ ప్రదేశాల్లో అనుమతులు లేకుండా వెలిసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, కటౌట్లు, హోర్డింగ్‌లను తొలగించాలని త...
(15 Apr) హైదరాబాద్, ఏప్రిల్ 14 : బహిరంగ ప్రదేశాల్లో అనుమతులు లేకుండా వెలిసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, కటౌట్లు, హోర్డింగ్‌లను తొలగించాలని తాము ఇదివరలో ఇచ్చిన ఆదేశాలను ఈ నెల 17లోగా అమలు చేసి తీరాల్సిందేనని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అనధికారికంగా ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు, బ్యానర్లు, కటౌట్లు, హోర్డింగ్‌లను తొలగించాలన్న కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో అధికారులు విఫలమవుతున్నారని అభిప్రాయపడిన ధర్మాసనం.....వాటిని తొలగించడం మీవల్ల కాకపోతే వాటిని తొలగించడానికి తామే చర్యలు చేపడతామని హెచ్చరించింది. ప్రకాశం జిల్లాలోని ముక్తినూతలపాడు, గుడిమిల్లపాడు గ్రామాల్లో ఏర్పాటు చేసిన విగ్రహాలను తొలగించాలంటూ 2008 లో దాఖలైన వ్యాజ్యంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణజ్యోతి సేన్‌గుప్తా, జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. ప్రముఖుల పుట్టిన రోజులు, ఇతర పర్వదినా లు సందర్భంగా అభిమానులు రాత్రికి రాత్రే ఫ్లెక్సీలు, బ్యానర్లు వంటివి ఏర్పాటు చేస్తున్నారని, వాటిని తొలగించే కార్యక్రమం నిరంతరం కొనసాగిస్తున్నా...కొత్తవి ఏర్పాటవుతున్నాయని వాటిని తొలగించడం కష్టసాధ్యంగా మారుతోందన్న తెలంగాణ ఏజీ వాదనలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.