శ్రీరాంపూర్ , ఏప్రిల్ 10: గని ప్రమాదంలో చనిపోయిన కార్మికులకు మ్యాచింగ్ గ్రాంట్తో సంబంధం లేకుండా రూ.25లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఎ...
శ్రీరాంపూర్ , ఏప్రిల్ 10: గని ప్రమాదంలో చనిపోయిన కార్మికులకు మ్యాచింగ్ గ్రాంట్తో సంబంధం లేకుండా రూ.25లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఎ ఐటియుసి ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కె-7 గనిపై పర్యటించి కార్మికులతో మాట్లాడారు. ప్రమాదంలో చనిపోయిన కార్మికులకు మ్యాచింగ్ గ్రాంట్ ఇప్పిస్తామని గుర్తింపు సంఘం చెప్పడం సరైంది కాదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు చనిపోతే ప్రభుత్వం రూ.40లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిందని, సింగరేణి కార్మికులు ప్రకృతికి విరుద్దంగా భూగర్భంలోకి వెళ్ళి పని చేస్తూ ప్రమాదంలో మృతి చెందితే 25లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వడానికి వెనుకాడుతున్నారన్నారు. సకలజనుల సమ్మె 35రోజుల వేతనం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో సింగరేణికి వచ్చిన లాభాలను ప్రకటించాలన్నారు.