బాసర, ఏప్రిల్ 1: సంపూర్ణ చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని ఈ నెల 4వ తేదీ శనివారం శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయంతోపాటు ఉప ఆలయాలను నిత్య పూజల ...
బాసర, ఏప్రిల్ 1: సంపూర్ణ చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని ఈ నెల 4వ తేదీ శనివారం శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయంతోపాటు ఉప ఆలయాలను నిత్య పూజల అనంతరం ఉదయం 9 గంటలకు ఆలయ ద్వారా బంధనం చేయబడునని ఆలయ ఈవో రమణమూర్తి, ప్రవీన్పాఠక్లు తెలిపారు. అదేరోజు సాయంత్రం 7.30 గంటలకు గ్రహణం మోక్షకాలం అనంతరం దేవాలయంను తెరిచి సంప్రోక్షణ చేసిన అనంతరం అమ్మవార్లకు అభిషేక, అలంకారాలను నిర్వహించి రాత్రి 9 గంటల వరకు దర్శనభాగ్యం కల్పించబడునని వేడుకొన్నారు. ఈ సమావేశంలో ఆలయ ఏఈవో అశోక్, సూపరిండెంట్ సాయిలు, ఇన్స్పెక్టర్ వెంకన్న పాల్గొన్నారు.
