(14 Apr) దస్త్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులందరికీ తెలంగాణ ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇచ్చేందుకు ముఖ్యమ...
(14 Apr) దస్త్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులందరికీ తెలంగాణ ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఈ దస్త్రంపై ఆయన సోమవారం సంతకం చేశారు. సుమారు 56 వేల మంది ఉద్యోగులకు ఈ ప్రోత్సాహకం అందనుంది. సంస్థకు సంబంధించి జరిపిన సమీక్షలో తెలంగాణ ఆర్టీసీ లోగో, బస్సుల డిజైన్‌ను ముఖ్యమంత్రి ఆమోదించారు. రాష్ట్రంలోని 60 నగరాలు/ పట్టణాల నుంచి నేరుగా హైదరాబాద్‌కు ఇంద్ర (ఏసీ) బస్సులను నడపాలని నిర్ణయించారు. వీటికి రాజధాని అనే పేరు ఖరారుచేశారు. అన్ని స్థాయుల్లో సిబ్బంది పక్కా ప్రణాళిక, సమయపాలన, చిత్తశుద్ధితో పనిచేసి ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించాలని సీఎం స్పష్టంచేశారు. సమీక్షా సమావేశంలో మంత్రులు పి.మహేందర్‌రెడ్డి, టి.హరీశ్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఆర్టీసీ సంయుక్త మేనేజింగ్ డైరెక్టర్ జీవీ రమణారావు తదితరులు పాల్గొన్నారు.