సింగరేణి సంస్థ 2014-15 ఆర్థిక సంవత్సరంలో సా ధించిన లాభాలను ప్రకటించి కార్మికులకు 25శాతం వాటా చెల్లించాలని ఎఐటియుసి ప్ర ధాన కార్యదర్శి వాసి...
సింగరేణి సంస్థ 2014-15 ఆర్థిక సంవత్సరంలో సా ధించిన లాభాలను ప్రకటించి కార్మికులకు 25శాతం వాటా చెల్లించాలని ఎఐటియుసి ప్ర ధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం బ్రాంచి కార్యదర్శి ల్యాగల శ్రీనివాస్, పిట్ కార్యదర్శి ఎం.మల్లేష్ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కె-5 గనిని సందర్శించి కార్మికులతో మాట్లాడారు. వార్షిక లక్ష్యాలను అధిగమించిన కార్మికులకు మేడే సందర్బంగా లాభాల్లో 25శాతం వాటా చెల్లించాలన్నారు. రానున్న 3సంవత్సరాల్లో సింగరేణిలో సుమారు 12వేల మంది కార్మికులు పదవీవిరమణ పొందనున్నారని వారి స్థానాల్లో వారసత్వ ఉద్యోగాలను కల్పించాలన్నారు. కార్మికులు వారి పిల్లలను టెక్నికల్ చదువులు ఐటిఐ, మెకానికల్ ఇంజనీరింగ్, డిప్లామా చదువులు చదివిస్తే వారికి సింగరేణిలో భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. జెబిసిసి ఐ నిబంధనల ప్రకారం కోల్‌ఫిల్లర్ కార్మికులను జనరల్ మజ్దూర్ మొదటి క్యాటగిరి కాకుండా గ్రూప్-5 వేతనాలు చెల్లించాలని తెలిపారు. మిషన్ మైనింగ్‌లో ఫిల్లింగ్ చేస్తున్న కార్మికులకు మైన్ ఆవరేజ్, ఫిల్లింగ్ వేతనాలు చెల్లించాలని పేర్కొన్నారు. డైలీ రేటెడ్ ప్రమోషన్ ఖాళీలను యాక్టింగ్ కార్మికులకు ప్రమోషన్లు కల్పించి భర్తీచేయాలని అన్నారు. 2012-13 బదిలీ ఫిల్లర్ కార్మికులను పర్మినెంట్ చేయాలన్నారు. ఉత్పత్తి లక్ష్యాలను సాధించిన కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరింస్తే ఈ సంవత్సరం నిర్ధేశించిన 60మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధిస్తారని దీని వల్ల సంస్థ అభివృద్ధికి, కార్మికుల కుటుంబాల సంక్షేమానికి ద్రోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కె.వీరభద్రయ్య, కేంద్ర కార్యదర్శి మంద మల్లారెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి కలవేన శంకర్, ఎఐటియుసి మండల కార్యదర్శి అఫ్రోజ్‌ఖాన్, ఎఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కారుకూరి నగేష్, బ్రాంచి నాయకులు పెసరి రాజయ్య, రాంచందర్, సంఘ రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా ఆసిఫాబాద్, ఎప్రిల్ 17: వెనక బడ్డ ఆసిఫాబాద్ నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని పార్లమెంటరీ కార్యదర్శి కోవ లక్ష్మి అన్నారు. మండలంలోని పంచాయతీ రాజ్ రోడ్డు నుండి తెనుగుగూడ (గొల్లగుడ) వరకు రూ. 1.25 కోట్లతో నిర్మించ తలపెట్టిన బిటి రోడ్డు, రూ. 85 లక్షలతో పిడబ్ల్యుడి రోడ్డు నుండి తెనుగుడ ( ఇప్పల్‌నవేగాం) వరకు నిర్మించ తలపెట్టిన బిటి రోడ్డుకు కోవలక్ష్మి శుక్రవారం భూమిపూజ చేశారు. ఈసందర్భంగా ఆమె ప్రజల నుద్దేశించి మాట్లాడుతూ నియోజక వర్గంలోని అన్ని మండలాల్లో కనీస వసతుల కల్పనకు కృషి చేస్తానన్నారు. అభివృధ్ది విషయంలో ఏమాత్రం రాజీపడే సమస్యే లేదని తేల్చిచెప్పారు. తొలుత ఇప్పల్‌నవేగాం గ్రామస్థులతో మాట్లాడిన కోవలక్ష్మి అసంపూర్తిగా ఉన్న హౌసింగ్ ఇండ్ల నిర్మాణం పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందని, దీంతో ఈ ఇండ్లను పూర్తి చేసుకోవచ్చన్నారు. అదే విధంగా గ్రామంలోఅంతర్గత రోడ్డ నిర్మాణానికి నిధుల మంజూరీ చేస్తానన్నారు. రక్షిత మంచినీటి పథకం వినియోగంలోకి తీసుకొచ్చేందుకు గ్రామపంచాయతీకి వచ్చిన నిధులను ఖర్చు చేస్తామన్నారు. బూర్గుడాలో ప్రజల నుద్దేశించి కోవలక్ష్మి మాట్లాడుతూ స్ధానిక సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తానన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దశల వారీగా నెరవేరుస్తానని తెలిపారు. ఏ సమస్య తలెత్తినా ప్రజలు నేరుగా తన వద్దకు రావాలని సూచించారు. ఈకార్యక్రమంలో తూర్పుజిల్లా అధ్యక్షుడు పురాణం సతీష్, ఎంపిపి తారాబాయి, సింగిల్ విండోఛైర్మెన్ అలీ, సర్పంచ్ కాశయ్య, ఎంపిటిసిలు సుగుణాకర్, మామిడి లక్ష్మి, ముఖ్య నేత గాదెవేని మల్లేష్, ఇతర నాయకులు గంధం శ్రీనివాస్, గుండ వెంకటేశ్వర్, వాహబ్, మహమూద్, అన్సార్, సాజిద్, జీవన్, అహ్మద్, సాలం, ఖాళీద్, ఉమారాణి, సింగాడె అశోక్, ప్రేం, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.