-మే 14న ఎంసెట్ -ఫైన్‌తో మే 12 వరకు దరఖాస్తు గడువు -ఎంసెట్ కన్వీనర్ రమణారావు హైదరాబాద్: మే 14న నిర్వహించే ఎంసెట్ పరీక్షకు ని...
-మే 14న ఎంసెట్
-ఫైన్‌తో మే 12 వరకు దరఖాస్తు గడువు
-ఎంసెట్ కన్వీనర్ రమణారావు
హైదరాబాద్: మే 14న నిర్వహించే ఎంసెట్ పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని ఎంసెట్ కన్వీనర్ రమణారావు స్పష్టం చేశారు. ఈ పరీక్ష నిర్వహణకు ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగంలో 230 కేంద్రాలు, మెడికల్ కోసం 180 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష ఉదయం 10 నుంచి 1 గంట వరకు ఇంజినీరింగ్, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు మెడికల్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రూ. 500 ఆలస్య ఫీజుతో ఏప్రిల్ 15 వరకు, రూ. 1000తో 22 ఏప్రిల్, రూ. 5000తో మే 5, రూ.10 వేలతో మే 12 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునే అవకాశముందన్నారు. మే 8 నుంచి 12 వరకు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని రమణారావు పేర్కొన్నారు.
తెలంగాణ ఎంసెట్‌కు అధిక డిమాండ్
తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహించే ఎంసెట్-2015కు అధిక డిమాండ్ ఏర్పడింది. గురువారం రాత్రి తొమ్మిది గంటల వరకు 2,26,907 దరఖాస్తులు వచ్చినట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణరావు పేర్కొన్నారు. ఇంజినీరింగ్ విభాగానికి 1,34,996, మెడిసిన్‌కు 89,405 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇంజినీరింగ్, మెడిసిన్ రెండు కోర్సులకు కలిపి 1,253 వచ్చాయని తెలిపారు. వీరిలో బాలురు 1,18,288 మంది, బాలికలు 1,08,619 మంది ఉన్నారు. తెలంగాణలోని ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలకు అధిక డిమాండ్ ఉన్నది. సుమారు 51,071 దరఖాస్తులు ఆంధప్రదేశ్, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చాయి. ఇందులో మెడిసిన్ కోసం 30,090, ఇంజినీరింగ్‌కు 20,453 దరఖాస్తులు, రెండు కోర్సులకు కలిపి 269 దరఖాస్తులు స్వీకరించినట్లు ఎంసెట్ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం 1.56 లక్షల ఇంజినీరింగ్, 2550 మెడికల్ సీట్లు ఉన్నాయని వెల్లడించారు.
