(3 Apr) హోం మంత్రి నాయినిహైదరాబాద్: నల్గొండ జిల్లా సూర్యాపేటలో బుధవారం అర్ధరాత్రి దుండగుల కాల్పుల్లో చనిపోయిన పోలీసు సిబ్బందికి తెలంగాణ...
(3 Apr) హోం మంత్రి నాయినిహైదరాబాద్: నల్గొండ జిల్లా సూర్యాపేటలో బుధవారం అర్ధరాత్రి దుండగుల కాల్పుల్లో చనిపోయిన పోలీసు సిబ్బందికి తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి, విద్యుత్ మంత్రి జగదీష్‌రెడ్డి, డీజీపఅ అనురాగ్‌శర్మ నివాళులు అర్పించారు. వారు మొదట హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీఐ మొగలయ్య, హోంగార్డు కిషోర్‌బాబులను పరామర్శించారు. అనంతరం నల్గొండ జిల్లా సూర్యాపేటకు చేరుకున్నారు. అక్కడ మృతి చెందిన పోలీసులు మెట్టు లింగయ్య, కుమ్మరి మహేష్‌లకు నివాళి అర్పించారు. ఆ తర్వాత బస్‌స్టాండులో కాల్పులు జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. డీజీపీ అనురాగ్‌శర్మ, హైదరాబాద్ రేంజి ఐజీ నవీన్‌చంద్, డీఐజీ గంగాధర్‌లు వారివెంట ఉన్నారు. కాల్పుల్లో చనిపోయిన కానిస్టేబుల్ లింగయ్య కుటుంబానికి రూ. 40 లక్షలు, హోంగార్డు మహేష్ కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వనున్నట్లు హోంమంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించిన తర్వాత కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు కృషిచేస్తామని ప్రకటించారు. కాల్పులకు తెగబడ్డ దుండగుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కాల్పులు అంతర్రాష్ట్ర ముఠా పనేనని తెలిపారు. పోలీసులు దుండగులను అనుమానించి పట్టుకునే ప్రయత్నం చేయడం అభినందనీయమన్నారు. బాధితులకు పూర్తిగా వైద్యసదుపాయాలను ప్రభుత్వం భరిస్తుందన్నారు.
