కరీంనగర్: చికెన్, ఎగ్‌లు తినడంపై ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించడానికి స్వయంగా మంత్రి ఈటల రాజేందర్ ఇతర నేతలు రంగంలోకి దిగారు. ఇవాళ ...
కరీంనగర్: చికెన్, ఎగ్‌లు తినడంపై ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించడానికి స్వయంగా మంత్రి ఈటల రాజేందర్ ఇతర నేతలు రంగంలోకి దిగారు. ఇవాళ జిల్లా కేంద్రంలో ప్రపంచ పశువైద్య దినోత్సవం సందర్భంగా నిర్వహించిన చికెన్, ఎగ్ మేళాలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చికెన్, ఎగ్ తినడం వల్ల ఎలాంటి నష్టంగానీ, ప్రమాదం గానీ లేదని తెలిపారు. బర్డ్‌ఫ్లూ మన దేశంలో పుట్టిన వైరస్ కాదని అది ప్రపంచమంతా తిరుగుతూ వస్తోందని వివరించారు. ఎగ్, చికెన్‌ను ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉడికించి తింటే ప్రమాదం లేదన్నారు.
నిన్నటి టీఆర్ఎస్ ప్లీనరీలో 8 టన్నుల చికెన్, పది వేల గుడ్లతో భోజనాలు వడ్డించామని పేర్కొన్నారు. ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా చికెన్ తినొచ్చని తెలిపారు. స్వయంగా మంత్రి, తెలంగాణ సాంస్కృతిక రథసారథి రసమయి బాలకిషన్, జెడ్పీ ఛైర్మన్ తుల ఉమ, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పుట్ట మధు, కలెక్టర్ పౌసామి బసు ఇతర ఉన్నతాధికారులు స్వయంగా చికెన్, ఎగ్ వంటకాలను ఆరగించారు.