(8 Apr) * పది రోజుల్లోగా పూర్తి చేయాలి సంగారెడ్డి , ఏప్రిల్ 8 : ఇంటింటికి తిరిగి జిల్లా ప్రజల ఆధార్ కార్డుల నంబర్లను సేకరించి పది రోజుల...
(8 Apr) * పది రోజుల్లోగా పూర్తి చేయాలి
సంగారెడ్డి , ఏప్రిల్ 8 : ఇంటింటికి తిరిగి జిల్లా ప్రజల ఆధార్ కార్డుల నంబర్లను సేకరించి పది రోజుల్లో ఓటర్ కార్డులతో అనుసంధానం చేయాలని జాయింట్ కలెక్టర్ పి.వెంకట్రామ్రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంగారెడ్డి డివిజన్ స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ ఈ ప్రక్రియ ఈ నెల 1వ తేదీ నుండి ప్రారంభమైందని మరో పది రోజుల్లో ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఈ అనుసంధాన ప్రక్రియ అవశ్యకత, ప్రాముఖ్యతపై గ్రామ స్థాయిలో ప్రచారం నిర్వహించి చైతన్య పర్చాలన్నారు. రెండు రోజుల్లో మండల స్థాయిలో సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, జడ్పీటిసిలు, విఆర్ఓలతో సమావేశం నిర్వహించి చైతన్యం కలిగించాలని తహవీల్దార్లను ఆదేశించారు. జిల్లాలో 22,16,697 ఓటర్లు ఉండగా ఇప్పటి వరకు 4,42,775 ఆధార్ నంబర్లను సేకరించడం జరిగిందని తెలిపారు. కోడిగుడ్ల సరఫరాపై సమీక్ష అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న కోడిగుడ్లు తగిన పరిమానంలో లేకుంటే సరఫరా దారులపై చర్యలు తీసుకుంటామని జాయంట్ కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సిడిపిఓలు, సూపర్వైజర్లతో సమీక్షించారు. వేసవి నేపథ్యంలో గుడ్లు త్వరగా కుళ్లిపోయే ప్రమాదం ఉందని, నాణ్యమైన వాటినే సరఫరా చేయాలని సూచించారు. ఇకపై తహశీల్థార్లు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించాలని ఆదేశించారు. ప్రతి నెల మొదటి వారంలో సమీక్షలు నిర్వహిస్తామన్నారు. సకాలంలో సరఫరా చేయలేకపోయినా, నాణ్యత లేకపోయినా రిపోర్టు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.సమీక్షలో జడ్పీ సిఇఓ మధు, డిఆర్ఓ దయానంద్, డిఆర్డిఎ పిడి సత్యనారాయణరెడ్డి, ఆర్డీఓ మధుకర్‌రెడ్డి, ఐసిడిఎస్ పిడి లక్ష్మిదేవి, తహసీల్ధార్లు, సిడిపిఓలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.