గరిడేపల్లి: తండ్రి నడిపే బస్సు కింద ప్రమాదవశాత్తు పడి కొడుకు మృతిచెందాడు. నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం సర్వారం పరిధిలోని లక్ష్మీపురం గ...
గరిడేపల్లి: తండ్రి నడిపే బస్సు కింద ప్రమాదవశాత్తు పడి కొడుకు మృతిచెందాడు. నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం సర్వారం పరిధిలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన లొడంగి సాయిలు హుజూర్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు నడుపుతున్నాడు.గురువారం రాత్రి లక్ష్మీపురంలోని తన ఇంటి పక్కన బస్సును నిలుపుతుండగా, ఆయన కొడుకు సిద్ధార్థ(2) బస్సు దగ్గరకు వస్తూ వెనుక టైరు కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు.