జయహో సింగరేణి

(2 Apr) కొత్తగూడెం, ఏప్రిల్ 1: నూతన జవసత్వాలను నింపుకొని సింగరేణి సంస్థ 2014-15 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 52.5మిలియన్ టన్నుల బొ...

(2 Apr) కొత్తగూడెం, ఏప్రిల్ 1: నూతన జవసత్వాలను నింపుకొని సింగరేణి సంస్థ 2014-15 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 52.5మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించింది. మూడుమాసాల క్రితం వరకు లక్ష్యసాధన అసాధ్యమని అధికారులు భావించారు. కానీ నూతన తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న బొగ్గు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా సింగరేణి సంస్థ తనవంతు బాధ్యతను నిర్వర్తించాలని మూడుమాసాల క్రితం నూతన సిఎండిగా బాధ్యతలు చేపట్టిన ఎన్ శ్రీ్ధర్ అధికారులతో ఇబ్బడిముబ్బడిగా సమావేశాలు నిర్వహించడం, సంస్థ పరిధిలోని అన్ని ఏరియాలను సందర్శించి సూచనలు ఇవ్వడం, కార్మికులలో చైతన్యం కల్గించడం, అధికారులలో అంకితభావం పెంచడం కారణంగా సత్ఫలితాలు మూడుమాసాలలో వచ్చాయి. మొదట్లో 55మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నప్పటికి తరువాత క్రమంలో సాంకేతికంగా ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని 52.5మిలియన్ టన్నులకు కుదించుకుంది. ఈనేపథ్యంలో పకడ్బందీ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని అమలుచేయడం వలన ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించగలిగింది. ఏరియాల వారీగా బొగ్గు ఉత్పత్తి వివరాలిలావున్నాయి. కొత్తగూడెం ఏరియా 58,00,000 టన్నుల లక్ష్యానికి 77,62,790 టన్నులు సాధించి 134శాతం ఉత్పాదకరేటుతో అగ్రస్థానంలో నిలిచింది. ఇల్లెందు ఏరియా 53,30,000 టన్నులకు 50,00,767 టన్నులు సాధించి 94శాతం, మణుగూరు ఏరియా 65,80,000 టన్నులకు 80,01,076 టన్నులు సాధించి 122శాతం, రామగుండం -1 ఏరియా 60,40,000 టన్నులకు 57,63,480 టన్నులు సాధించి 95శాతం, రామగుండం-2 ఏరియా 52,90,000 టన్నులకు 44,65,175 టన్నులు సాధించి 84శాతం, రామగుండం-3 ఏరియా 51,00,000 టన్నులకు 60,00,200 టన్నులు సాధించి 118శాతం, భూపాలపల్లి ఏరియా 33,00,000టన్నులకు 29,46,999 టన్నులు సాధించి 89శాతం, ఆడ్రియాల ప్రాజెక్టు 39,80,000 టన్నులకు 11,74,023 టన్నులు సాధించి 29శాతం, బెల్లంపల్లి ఏరియాల 61,40,000 టన్నులు 42,39,161 టన్నులు సాధించి 69శాతం, మందమర్రి ఏరియా 21,80,000 టన్నులకు 17,09,998 టన్నులు సాధించి 78శాతం, శ్రీరాంపూర్ ఏరియా 52,60,000 టన్నులకు 54,72,478 టన్నులు సాధించి 104శాతం ఉత్పాదకరేటును నమోదు చేసుకున్నాయి. భూగర్భగనుల ఉత్పత్తి లక్ష్యం 14,570,000 టన్నులు కాగా 102,02,673 టన్నులు సాధించి 70శాతం, ఓపెన్‌కాస్ట్ గనుల ఉత్పత్తి లక్ష్యం 40,430,000 టన్నులకు 42,333,494 టన్నులు సాధించి 105శాతం ఉత్పాదకరేటును నమోదు చేసుకున్నాయి. ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించిన సింగరేణీయులందరికి సంస్థ సిఎండి ఎన్ శ్రీ్ధర్ బుధవారం అభినందనలు తెలపడంతో పాటు భవిష్యత్‌లో కూడా రక్షణతో కూడిన ఉత్పత్తి చేసి సంస్థ లక్ష్యాలను సాధించాలని కోరారు

COMMENTS

పేరు

Adilabad AUDIO RELEASES ENTERTAINMENT GOSSIPS Health HYDERABAD INTERNATIONAL Job Search Jobs KARIMNAGAR KHAMMAM MAHABOOBNAGAR MEDAK MOVIE REVEWS NALGONDA NATIONAL NIZAMABAD Rangareddy SINGARENI NEWS TECHNOLOGY TELANGANA NEWS VIDEO SONGS WARANGAL worldcup2015
false
ltr
item
Tdaily.In - Telangana News: జయహో సింగరేణి
జయహో సింగరేణి
http://1.bp.blogspot.com/-Pw-CxQHWEMg/VRyYyqXYsvI/AAAAAAAAEv8/4Cg_yix_Wtw/s1600/350x350_IMAGE36254176.png
http://1.bp.blogspot.com/-Pw-CxQHWEMg/VRyYyqXYsvI/AAAAAAAAEv8/4Cg_yix_Wtw/s72-c/350x350_IMAGE36254176.png
Tdaily.In - Telangana News
https://telugunewvideos.blogspot.com/2015/04/blog-post_18.html
https://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/2015/04/blog-post_18.html
true
2091677902228022841
UTF-8
Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS CONTENT IS PREMIUM Please share to unlock Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy