ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించిన సింగరేణి

శ్రీరాంపూర్‌రూరల్, ఏప్రిల్ 1: సింగరేణి సంస్థ వార్షిక బోగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించిందని శ్రీరాంపూర్ చీఫ్ జనరల్ మేనేజర్ సిహెచ్.వెం...

శ్రీరాంపూర్‌రూరల్, ఏప్రిల్ 1: సింగరేణి సంస్థ వార్షిక బోగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించిందని శ్రీరాంపూర్ చీఫ్ జనరల్ మేనేజర్ సిహెచ్.వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం సిజిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉత్పత్తి వివరాలను వెల్లడించారు. సింగరేణి సంస్థ 2014-15 వార్షిక ఉత్పత్తి లక్ష్యం 52.5మిలియన్ టన్నుల లక్ష్యానికి 52.53 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించడం జరిగిందని తెలిపారు. సింగరేణిలోని 11 ఏరియాలకు గాను కొత్తగూడెం, మణుగూరు, ఆర్‌జి-3, శ్రీరాంపూర్ ఏరియాలు 100శాతం ఉత్పత్తి సాధించాయని తెలిపారు. శ్రీరాంపూర్ ఏరియాలోని అన్ని భూగర్భగనులు 100శాతం ఉత్పత్తి సాధించి రికార్డు నెలకొల్పాయని తెలిపారు. శ్రీరాంపూర్ ఓసిపి కంటే భూగర్భగనులు అత్యధిక ఉత్పతి చేయడం జరిగిందన్నారు. వార్షిక ఉత్పత్తి లక్ష్యసాధనలో శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్‌కె-5 గని ఉత్పత్తి లక్ష్యం 400000 టన్నులకు గాను 447303 టన్నులు సాధించి 112 శాతం, ఆర్‌కె-6 గని 420000 టన్నులకు గాను 445847 టన్నుల ఉత్పత్తితో 106శాతం, ఆర్‌కె-7 గని లక్ష్యం 400000 టన్నులకు గాను 446123 టన్నులతో 111శాతం, ఆర్‌కెన్యూటెక్ 700000 టన్నులకు గాను 702000 టన్నులతో 100శాతం ఉత్పత్తి సాధించడం జరిగిందని తెలిపారు. ఆర్‌కె-8 గని ఉత్పత్తి లక్ష్యం 160000 టన్నులకు 162110 టన్నులతో 100శాతం, ఎస్‌ఆర్‌పి-1 160000 టన్నులకు గాను 168238 టన్నులతో 105శాతం, ఎస్‌ఆర్‌పి-3 280000 టన్నులకు గాను 312014 టన్నులతో 111శాతం, ఐకె-1ఎ 240000 టన్నులకు గాను 247574 టన్నుల ఉత్పత్తితో 103శాతం ఉత్పత్తి సాధించడం జరిగిందని తెలిపారు. శ్రీరాంపూర్ ఓపెన్‌కాస్టు గని వార్షిక ఉత్పత్తి లక్ష్యం 2500000 టన్నులకు గాను 2541289 టన్నుల ఉత్పత్తితో 101శాతం సాధిచిందని తెలిపారు. ఆర్‌కె-8 గని 6సంవత్సరాల అనంతరం, ఐకె-1ఎ గని 7సంవత్సరాల అనంతరం వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించడం జరిగిందని పేర్కొన్నారు. సిహెచ్‌పిలో 5లక్షల 48వేల టన్నుల బొగ్గు నిల్వ ఉందని తెలిపారు. 2015-16 సింగరేణి వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 60.30 మిలియన్ టన్నులుగా, శ్రీరాంపూర్ ఏరియాకు 55లక్షల టన్నులుగా నిర్ధేశించడం జరిగిందని తెలిపారు. ఉత్పత్తి లక్ష్య సాధన కోసం రోజు వారి, నెల వారి లక్ష్యలను అధిగమిస్తూ వార్షి క ఉత్పత్తిని సాధిస్తామన్నారు. ఈ సమావేశంలో ఎస్‌ఓటూ జిఎం సత్యనారాయణ, ఎజిఎం ఫణికుమార్, డివైజిఎం పర్సనల్ శర్మ, పర్సనర్ మేనేజర్ కిరణ్, డిజిఎం సివిల్ ప్రసాద్‌రావు, గ్రూప్ ఏజంట్లు జాన్ ఆనంద్, పి.శ్రీనివాస్, కె.వెంకటేశ్వర్లు, ఓసి ప్రాజెక్ట్ అధికారి గణపతి, డివైసిఎంఓ లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. 13వ ఆర్థిక సంఘం నిధులు విడుదల ఆదిలాబాద్, ఏప్రిల్ 1: జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో 13వ ఆర్థిక సంఘం ద్వారా కొనసాగుతున్న అభివృద్ది పనులకు రెండవ విడతగా ప్రభుత్వం 6 కోట్ల లక్షా 78 వేల నిధులు మంజూరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసేందుకు బల్దియాల్లో ఈ నిధులు ప్రగతి నివేదిక ఆధారంగా ఖర్చు చేయనున్నారు. వీటిలో ఆదిలాబాద్ మున్సిపాలిటీకి కోటి 44 లక్షల నిధులు రాగా, మంచిర్యాలకు 92.36 లక్షలు, బెల్లంపల్లికి 87.56, నిర్మిల్‌కు 58.86, భైంసాకు 53.55, కాగజ్‌నగర్‌కు 78.13, మందమర్రికి 87.30 లక్షలు మంజూరి అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 6 కోట్ల లక్షా 78 వేల నిధులతో రెండవ విడత పనులు చేపట్టనున్నారు.

COMMENTS

పేరు

Adilabad AUDIO RELEASES ENTERTAINMENT GOSSIPS Health HYDERABAD INTERNATIONAL Job Search Jobs KARIMNAGAR KHAMMAM MAHABOOBNAGAR MEDAK MOVIE REVEWS NALGONDA NATIONAL NIZAMABAD Rangareddy SINGARENI NEWS TECHNOLOGY TELANGANA NEWS VIDEO SONGS WARANGAL worldcup2015
false
ltr
item
Tdaily.In - Telangana News: ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించిన సింగరేణి
ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించిన సింగరేణి
http://4.bp.blogspot.com/-a3M5k7JFfGI/VRyVchDjXkI/AAAAAAAAEvE/cqTnyoNiVg4/s1600/coal--621x414.jpg
http://4.bp.blogspot.com/-a3M5k7JFfGI/VRyVchDjXkI/AAAAAAAAEvE/cqTnyoNiVg4/s72-c/coal--621x414.jpg
Tdaily.In - Telangana News
https://telugunewvideos.blogspot.com/2015/04/blog-post_2.html
https://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/2015/04/blog-post_2.html
true
2091677902228022841
UTF-8
Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS CONTENT IS PREMIUM Please share to unlock Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy