(2 Apr) ఎస్పీ అంబర్ కిశోర్ ఝా వరంగల్, నమస్తే తెలంగాణ : మహిళలను వేధించే పోకిరీలకు చెక్ పెట్టి వారికి భద్రత కల్పించేందుకు రూరల్, అర్బన్ పర...
(2 Apr) ఎస్పీ అంబర్ కిశోర్ ఝా వరంగల్, నమస్తే తెలంగాణ : మహిళలను వేధించే పోకిరీలకు చెక్ పెట్టి వారికి భద్రత కల్పించేందుకు రూరల్, అర్బన్ పరిధిలో షీ టీమ్స్‌ను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అంబర్ కిశోర్ ఝా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ సిటీలో షీటీమ్స్ విజయవంతం అయిన నేపథ్యంలో డీజీపీ అనురాగ్ శర్మ అన్ని జిల్లాల్లో టీమ్స్‌ను ఏర్పాటు చేయాలనే ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. నేటి నుంచి షీటీమ్స్ చురుకుగా పనిచేస్తాయన్నారు. మహిళలు ఎక్కువగా వేధింపులకు గురవుతున్న రద్దీ ప్రాంతాలను గుర్తించి అక్కడ షీ టీమ్స్‌ను ఏర్పాటు చేసి ఆకతాయిల పనిపట్టడమే ధ్యేయంగా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. మహిళలు, విద్యార్థినులు వేధింపులకు గురైన క్రమంలో వెంటనే 100కు ఫోన్ చేసినట్లయితే షీటీమ్స్ రంగంలోకి దిగి పోకిరీల పనిపడుతాయన్నారు. ఈవ్‌టీజింగ్, వేధింపులు, వెకిలిచేష్టలు ఇకపై ఉండవని ఎస్పీ అన్నారు. రూరల్, అర్బన్ పరిధిలో చురుకైన అధికారులు, సిబ్బందితో ఒక ఎస్సై సారధ్యంలో నాలుగు షీటీమ్స్ బృందాలు పనిచేస్తాయన్నారు.
.jpg)