(12 Apr) -పోలీసులకు ఫిర్యాదు, ఆలస్యంగా వెలుగులోకి ఫెర్టిలైజర్‌సిటీ : సినీ ఫక్కీలో అరకిలో బంగారం మాయమైన ఘటన గోదావరిఖనిలో ఆలస్యంగా వెలుగుచూ...
(12 Apr) -పోలీసులకు ఫిర్యాదు, ఆలస్యంగా వెలుగులోకి
ఫెర్టిలైజర్‌సిటీ : సినీ ఫక్కీలో అరకిలో బంగారం మాయమైన ఘటన గోదావరిఖనిలో ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికులు, బాధితులు, పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం.. గోదావరిఖనిలోని వ్యాపార, వాణిజ్య కేంద్రాలకు నిలయమైన లక్ష్మీనగర్‌లో ఏలేశ్వరం వెంకటేశ్ అనే వ్యక్తి శ్రీ సత్య జ్యువెల్లర్స్ పేరుతో బంగారం షాపు నిర్వహిస్తున్నాడు. బంగారం కొనుగోలు కోసం ఆన్‌లైన్‌లో నగదును బదిలీ చేసి గుమస్తా ద్వారా బంగారాన్ని గోదావరిఖనికి తెపిస్తుంటాడు. కొంత కాలంగా ఇ దే విధంగా లావాదేవీలు సాగిస్తున్న సదరు షాపు యజమాని తన దగ్గర పని చేసే పాత మున్సిపల్ కార్యాలయం వద్ద ఉండే ఊట్ల ఆగయ్య అనే గు మాస్తాను ఈనెల 9న ఉదయం 6.30 గంటలకు సికింద్రాబాద్ పంపించాడు. ఒంటిగంటకు సికింద్రాబాద్‌లోని జనరల్ బజార్‌కు చేరుకున్న ఆగ య్య శాంతినాథ్ జ్యువెల్లరీ షాపులో కిలో వెండి తీసుకుని బ్యాగులో భద్రపరుచుకున్నాడు. ఇదే క్రమంలో జనరల్ బజార్‌లోని ఓ మద్యం షాపు వద్ద ఆగయ్యకు గుర్తు తెలియని వ్యక్తి పరిచయమ య్యాడు. ఆగయ్యతో మాటలు కలిపిన ఆ వ్యక్తి మాయ మాటలు చెప్పి నమ్మించాడు. తర్వాత ఇద్దరూ మద్యం తాగి ఎవరిదారిన వారు వెళ్లారు. తర్వాత సికింద్రాబాద్‌లోని క్లాక్ కటవర్ వద్ద గల ఎస్‌వీబీసీ గోల్డ్‌షాపులో అరకిలో బంగారం తీసుకుని ఆగయ్య సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్టాండ్ లో బస్ ఎక్కాడు. అదే బస్సు ఎక్కిన గుర్తు తెలియని వ్యక్తి, వేరే బస్‌లో వెళ్దామని కోరాడు. దీం తో తాను టికెట్ తీసుకున్నానని రానని చెప్పాడు. బస్ దిగిన ఆ వ్యక్తి, కొద్ది సేపటి తర్వాత మళ్లీ వచ్చి తనది పెద్దపల్లి అనీ, తానూ వస్తున్నానని నమ్మిం చి ప్రక్కనే కూర్చున్నాడు. రాత్రి 10 గంటలకు గోదావరిఖని చేరుకున్న వీరు బస్టాండ్ పక్కనే ఉ న్న ఓ మద్యం దుకాణంలో మళ్లీ మద్యం తాగా రు. అనంతరం ఆగయ్యను బంగారం చూపాలని కోరడంతో తన బొడ్లో దాచిన బంగారాన్ని తీసి చూపాడు. దీంతో సదరు గుర్తుతెలియని వ్యక్తి దాన్ని లాక్కుని పరారయ్యాడు. దీంతో బిత్తర పోయిన ఆగయ్య రాత్రి ఒంటి గంటకు అతని భార్యకు, షాపు యజమానికి రోదిస్తూ చెప్పాడు. దీంతో షాపు యజమాని అతని నుంచి వివరాలు తెలుసుకుని వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చే శాడు. బంగారం విలువ రూ.13,48,500 దాకా ఉంటుందని బాధిత షాపు యజమాని తెలిపాడు. కాగా ఆగయ్యపైనా పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. లక్షల విలువైన బంగారం తీసుకుని గుర్తు తెలియని వ్యక్తితో కలిసి మద్యం తాగడం, పెద్దపల్లి అని చెప్పిన ఆ వ్యక్తి గోదావరిఖని దాకా రావడం, మళ్లీ అతనితో ఆగయ్య మద్యం తాగ డం లాంటి విషయాలపై పోలీసులు అనుమానం వ్యక్యం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకొని ద ర్యాప్తు చేస్తున్నారు.