ఈ కష్టం తీరనిది..

(14 Apr) నిండా మునిగిన వరి రైతు చేతికొచ్చిన పంట నీటిపాలు గాలులు, వడగండ్లతో పెరిగిన నష్టం మరో 24 గంటలు భారీ వర్షాలు అన్నదాత ఇంట సిరులు కుర...

ee kashtam tiranidi..
(14 Apr) నిండా మునిగిన వరి రైతు చేతికొచ్చిన పంట నీటిపాలు గాలులు, వడగండ్లతో పెరిగిన నష్టం మరో 24 గంటలు భారీ వర్షాలు అన్నదాత ఇంట సిరులు కురిపించాల్సిన పంట! మార్కెట్‌ యార్డు దాకా చేరింది! అమ్మకం పూర్తికాగానే రైతుకు రొక్కం అందాల్సి ఉంది. అంతలోనే... గాలి వాన బీభత్సం! ఆరుగాలం పడిన కష్టం... అంతా నాశనం! నల్లగొండ జిల్లా నకిరేకల్‌ మార్కెట్‌ యార్డులో కనిపించింది పై దృశ్యం! ఆదివారం, సోమవారం పిడుగులా పడిన వానలు అన్నదాతను నిలువునా ముంచేశాయి. అదును చూసి దెబ్బకొట్టిన శత్రువులా పంట చేలపై వరుణుడి దాడి జరిగింది. నల్లగొండ, కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో పంటలపై అకాల వర్షం తీవ్ర ప్రభావం చూపింది. అటు ఏపీలోని రాయలసీమలోనూ ఇదే పరిస్థితి. పొలంలో కోతకు సిద్ధంగా ఉన్న పంట నుంచి... కోత పూర్తయి యార్డుల్లో విక్రయానికి తరలించిన ధాన్యం సర్వం తడిసి ముద్దయ్యాయి. రైతు కడుపు నింపాల్సిన ధాన్యం... బస్తాల్లోనే మొలకెత్తింది. వరితోపాటు మామిడి, మొక్కజొన్న, బొప్పాయి, సజ్జ తదితర పంటలకు తీవ్ర నష్టం జరిగింది. (ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌) తెలంగాణలో రెండుమూడు రోజులుగా కురుస్తున్నఅకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వర్షాలకు వడగండ్లు, ఈదురుగాలులు తోడై నష్ట తీవ్రత పెరిగింది. నల్గొండ, కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో 50వేలకుపైగా ఎకరాల్లో చేతికొచ్చిన పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. ఒక్క అధికారీ తమను పట్టించుకోలేదంటూ నల్గొండ, కరీంనగర్‌ జిల్లాల్లో రైతులు రోడ్డెక్కారు. నల్లగొండ జిల్లాలో 4270 హెక్టార్లలో కోతకొచ్చిన వరి దెబ్బతింది. బీబీనగర్‌, భువనగిరి, భూదాన్‌పోచంపల్లి, సంస్థాన్‌ నారాయణపురం, చందంపేట, నేరేడుచర్ల తదితర మండలాల్లో వరికి తీవ్ర నష్టం వాటిల్లింది. పలు ప్రాంతాల్లో ఐకేపీ కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. నకిరేకల్‌, భువనగిరి మార్కెట్లలో ధాన్యం మొలకెత్తింది. కరీంనగర్‌ జిల్లాలో 7421 హెక్టార్ల లో వరి, మొక్కజొన్న, నువ్వు, సజ్జ పంటలు దెబ్బతిన్నాయి. 11977 హెక్టార్లలో మామిడి, 141.20హెక్టార్లలో అరటి, 73.2 హెక్టార్లలో బొప్పాయి, 25 హెక్టార్లలో కూరగాయ పంటలు దెబ్బతిన్నాయని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. నిజామాబాద్‌ జిల్లాలో మూడు రోజులుగా వర్షంతోపాటు వడగండ్లు పడుతుండటంతో 4562హెక్టార్లలో మొక్కజొన్న, వరి, సజ్జ, నువ్వు పంటలు దెబ్బతిన్నాయి. మామిడితోటలకు భారీ నష్టం వాటిల్లింది. పొలాల్లోని నువ్వు, జొన్న పంట వర్షాలకు మొలకెత్తుతోంది. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంతోపాటు బేల, జైనథ్‌, తాంసి, తలమడుగు, గుడి హత్నూర్‌, బజార్‌ హత్నూర్‌ తదితర మండలాల్లో మొక్కజొన్న, వరి, గోధుమ, నువ్వు పంటలు నేలకొరిగాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యంతోపాటు పంటపొలాల్లో ఆరబెట్టిన పసుపు తడిసిపోయింది. మొక్కజొన్న బస్తాలు తడిచిపోయాయి. ఈదురుగాలులకు చెట్లు విరిగిపడి విద్యుత్తు తీగలు తెగి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వరంగల్‌ జిల్లాలో సోమవారం భారీవర్షం పడింది. ఆరబెట్టిన మిర్చి, పసుపు, మొక్కజొన్న, పత్తి తడిసిపోయి నష్టం వాటిల్లింది. చేలల్లోని పంటలకు పెద్దగా నష్టం లేదని వ్యవసాయాధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో సుమారు 2వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. తాండూరు డివిజన్‌లో వేరుశనగ పొలాల్లోనే మొలకెత్తింది. ఇబ్రహీం పట్నం డివిజన్‌లో వరికి తీవ్రనష్టం వాటిల్లింది. ఘట్‌కేసర్‌ మండలంలో విద్యుత్తు స్తంభాలు నేలకొరిగి, సరఫరా ఆగింది. వికారాబాద్‌ డివిజన్‌లో టొమాటో పంటకు నష్టం వాటిల్లింది. అరటితోటలు నేలకొరిగాయి. శంకరపల్లిలో 9 సెంటీమీటర్ల వర్షంతో మూసీనది పొంగి, గంటపాటు రాకపోకలు ఆగిపోయాయి. ఖమ్మం జిల్లాలో కళ్లాల్లోని మిర్చికి తీవ్ర నష్టం జరిగింది. మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం కుర్తివాడలో సోమవారం వడగళ్ల వాన కురిసింది. 400 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. గజ్వేల్‌ డివిజన్‌ పరిధిలోనూ రాత్రి 8 గంటల ప్రాంతంలో అరగంటపాటు వడగండ్లతో భారీ వర్షం పడింది. వర్గల్‌ మండలం వర్గల్‌, అంబర్‌పేట, శాకారం, గుంటిపల్లి తదితర గ్రామాల్లో మేడికాయ సైజులో వడగండ్లు పడ్డాయి. వరి, మొక్కజొన్నతోపాటు కూరగాయల పంటలకు భారీ నష్టం వాటిల్లింది. రోడ్డెక్కిన అన్నదాతలు కరీంనగర్‌ జిల్లా జగిత్యాల మండలంలో నష్టపరిహారం కోసం రైతులు రోడ్డెక్కారు. జగిత్యాల మండలంలో వేలాది హెక్టార్లలో మామిడి, వరి, నువ్వు, అరటి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పొలాల్లో ఎండబెట్టిన మొక్కజొన్న, పసుపు పంటలు తడిసిపోయాయి. అధికారులు నష్టాన్ని అంచనా వేయడం లేదంటూ చల్‌గల్‌ రైతులు 200 మంది జగిత్యాల- రాయికల్‌ ప్రధానరహదారిపై ధర్నాకు దిగారు. నల్లగొండ జిల్లా వేములపల్లిలో రైతుల రాస్తారోకోవల్ల నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై ట్రాఫిక్‌ స్తంభించింది. హైదరాబాద్‌లో వడగళ్ల వాన హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): మూడు రోజులుగా వర్షాలతో హైదరాబాద్‌ తడిసి ముద్దవుతుండగా 6సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సోమవారం రాత్రి పలుప్రాంతాల్లో భారీ వర్షం, కొన్ని ప్రాంతాల్లో వడగళ్లవాన కురిసింది. కూకట్‌పల్లి, ఎర్రగడ్డ, మూసాపేట ప్రాంతాల్లో వడగళ్లు పడ్డాయి. ఈదురుగాలులకు చెట్లు విరిగిపడటంతో విద్యుత్తు వైర్లు తెగి, స్తంభాలు నేలకొరిగి సరఫరా ఆగింది. పిడుగుపాటుకు 20 గొర్రెలు మృతి రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ మండలం బండరావిరాల గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి గోద మల్లే్‌షకు చెందిన గొర్రెల మందపై పిడుగు పడడంతో 20 గొర్రెలు మృతిచెందాయి. హయత్‌నగర్‌ రెవెన్యూ అధికారులు సోమవారం వాటికి పంచనామా నిర్వహించారు. 

COMMENTS

పేరు

Adilabad AUDIO RELEASES ENTERTAINMENT GOSSIPS Health HYDERABAD INTERNATIONAL Job Search Jobs KARIMNAGAR KHAMMAM MAHABOOBNAGAR MEDAK MOVIE REVEWS NALGONDA NATIONAL NIZAMABAD Rangareddy SINGARENI NEWS TECHNOLOGY TELANGANA NEWS VIDEO SONGS WARANGAL worldcup2015
false
ltr
item
Tdaily.In - Telangana News: ఈ కష్టం తీరనిది..
ఈ కష్టం తీరనిది..
http://acdn.newshunt.com/fetchdata5/20150414/jyothy/Breakingnews/images/350x350_IMAGE38401116.png
Tdaily.In - Telangana News
https://telugunewvideos.blogspot.com/2015/04/blog-post_328.html
https://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/2015/04/blog-post_328.html
true
2091677902228022841
UTF-8
Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS CONTENT IS PREMIUM Please share to unlock Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy