హైదరాబాద్: రాష్ర్ట ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్ష ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి. సోమవారం మధ్యాహ్నం కల్లా ఫలితాలు విడుదల కానున్నట్లు ఇంటర...
హైదరాబాద్: రాష్ర్ట ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్ష ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి. సోమవారం మధ్యాహ్నం కల్లా ఫలితాలు విడుదల కానున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు వర్గాలు తెలిపాయి. సెకండియర్ పరీక్షల ఫలితాల విడుదలకు సంబంధించిన పనులు నేటి మధ్యాహ్నం వరకు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, ఐఐటీ-జేఈఈ మెయిన్స్ ఫలితాలు సోమవారం ఉదయం విడుదల చేయనున్నట్లు సీబీఎస్ఈ తన అధికారిక వెబ్సైట్లో వెల్లడించింది.
