(2 Apr) గోదావరిఖని, ఏప్రిల్ 1: పునరుర్దరణ జరుగుతున్న రామగుండం ఎరువుల కర్మాగారం స్థానిక నిరుద్యోగులకు, మాజీ కాంట్రాక్టు కార్మికులకు మళ్లీ...
(2 Apr) గోదావరిఖని, ఏప్రిల్ 1: పునరుర్దరణ జరుగుతున్న రామగుండం ఎరువుల కర్మాగారం స్థానిక నిరుద్యోగులకు, మాజీ కాంట్రాక్టు కార్మికులకు మళ్లీ ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తానని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ అన్నారు. బుధవారం రోజున ఎంపీ సుమన్, రామగుండం ఎమ్మెల్యే సొమారపు సత్యనారాయణ, మున్సిపల్ మేయర్ కొంకటి లక్ష్మినారాయణతోపాటు పలువురు ఫ్యాక్టరీని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అప్పటి పాలకుల నిర్లక్ష్యం వల్ల యూరియా ఉత్పత్తులు జరుపుతున్న ఫ్యాక్టరీ మూసివేయాల్సి వచ్చిందని, మళ్లీ టి ఆర్ ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి కెసి ఆర్ చొరవతోనే ఫ్యాక్టరీ పునరుర్దరణ జరుగుతుందని, ఎఫ్‌సి ఐ పునరుర్దరణతో తెలంగాణ రైతులకు ఎరువులు పుష్కలంగా లభిస్తాయని అన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ తెలంగాణ తలమానీకంగా ఉండనుందని అన్నారు. ఫ్యాక్టరీలో యూరియా ఉత్పత్తుల కోసం గ్యాస్ లింకేజీని జరిపించేందుకు ఈ నెల 22న జరిగే పార్లమెంటరీ సమావేశాల సందర్భంగా కేంద్ర ఎరువుల, రసాయనిక శాఖమంత్రి, ఇంధన శాఖ మంత్రులను కలిసి గ్యాస్ ఒప్పందం త్వరితగతిన జరిగేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక నిరుద్యోగులు, యువకులు, వివిధ సంఘాల నాయకులు ఎంపీకి వినతి పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు. నీరుంటేనే పల్లెల్లో పచ్చదనంగా * ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పెద్దపల్లి, ఏప్రిల్ 1: పల్లెలు పచ్చదనంతో వుండాలంటే చెరువులు జలకళతో ఉండాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. మండలంలోని గౌరెడ్డిపేట గ్రామంలో బుధవారం మిషన్‌కాకతీయ పనులు ప్రారంబించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో చెరువులు నిండితేనే రైతులు సుబిక్షంతో సుఖ సంతోషాలతో జీవితం గడుస్తుందన్నారు. చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత గ్రామీణ ప్రాంత వాసులదేనన్నారు. గ్రామంలోని చెరువుల మట్టిని రైతులు పోలాలలో పోసుకోని సద్వినియోగం చేసుకోవాలిని ఆయన సూచించారు.ఈకార్యక్రమంలో ఎంపిపి సందనవేని సునిత, సర్పంచ్ పాలేటి కవిత-కొమురయ్య, ఎంపిటీసీ పులిపాక శారద-రవిందర్, బండారి తిరుపతి, కోట శ్రీనివాస్, వార్డు సభ్యులు పాల్గోన్నారు.
