(3 Apr) హైదరాబాద్, ఏప్రిల్ 2: ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ చిన్నారిపై పది వీధి కుక్కలు సమూహంగా దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన కర్మన్ఘాట్...
(3 Apr) హైదరాబాద్, ఏప్రిల్ 2: ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ చిన్నారిపై పది వీధి కుక్కలు సమూహంగా దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన కర్మన్ఘాట్ డివిజన్ కృష్ణానగర్లో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కళా వెంకటేశ్ దంపతులు కృష్ణానగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వారి కుమార్తె స్వాతి (6) స్థానిక అల్పాన్సా పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతోంది. గురువారం మూడు గంటల సమయంలో బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండగా అటుగా వచ్చిన వీధి కుక్కలు ఒక్కసారిగా బాలికపై దాడిచేసి గాయపర్చాయి. అది గమనించిన కుటుంబ సభ్యులు చిన్నారిని పక్కనే ఉన్న మెడికేర్ ఆసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స నిర్వహించి వైద్యుల సలహా మేరకు నారాయణగూడలోని ప్రత్యేక ఆసుపత్రికి తరలించారు. గతంలో వనస్థలిపురంలో ఓ బాలికపై దాడిచేసిన విషయం విధితమే. వీధి కుక్కలను పట్టుకోవడంలో జిహెచ్ఎంసి సిబ్బంది పూర్తి నిర్లక్ష్యం కారణంగానే ఈ కుక్కలదాడి జరిగినట్లు స్థానికులు ఆరోపించారు.
