(22 Apr) ఆదిలాబాద్, ఏప్రిల్ 21: అల్పపీడనం.. అకాల వర్షాలతో వారం రోజుల పాటు చల్లటి గాలులకు ఉపశమనం పొందిన జిల్లా ప్రజలు మంగళవారం ఒక్కసారిగా ప...
(22 Apr) ఆదిలాబాద్, ఏప్రిల్ 21: అల్పపీడనం.. అకాల వర్షాలతో వారం రోజుల పాటు చల్లటి గాలులకు ఉపశమనం పొందిన జిల్లా ప్రజలు మంగళవారం ఒక్కసారిగా పెరిగిన ఉష్ణప్రకోపానికి విలవిలలాడిపోయారు. వాతావరణంలో అనూహ్యంగా సంభవించిన మార్పులు, గ్లోబల్‌వార్మింగ్ ప్రభావంగా గత మూడేళ్లలో లేని పగటి ఉష్ణోగ్రత రికార్డును బద్దలుకొట్టింది. జిల్లాలో వేడిగాలులకు తోడు నిప్పుల కొలిమిలా మండుతున్న ఎండలతో సామాన్య జనం అల్లాడిపోతుండగా, పిల్లలు, వృద్దులు, మహిళల పరిస్థితి అగమ్యగోచరంగా మరుతోంది. పగటి ఉష్ణోగ్రతలకు తోడు రాత్రి వేళల్లో సైతం కనిష్ట ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు తంటాలు పడుతున్నారు. మంగళవారం పగటి ఉష్ణోగ్రత 41.2 డిగ్రీలు నమోదైంది.