(1 Apr) మానవపాడు, ఏప్రిల్ 1: ఏపి రాష్ట్రం నుంచి వచ్చే ప్రైవేటు బస్సులు, వాణిజ్య వాహనాల నుంచి పన్ను వసూలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణ...
(1 Apr) మానవపాడు, ఏప్రిల్ 1: ఏపి రాష్ట్రం నుంచి వచ్చే ప్రైవేటు బస్సులు, వాణిజ్య వాహనాల నుంచి పన్ను వసూలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ వైపు వెళ్లే వాణిజ్య వాహనాలకు రాష్ట్ర సరిహద్దు మానవపాడు మండలం జల్లాపురం ఆర్టీఎ చెక్‌పోస్టు వద్ద మంగళవారం అర్ధరాత్రి నుంచి పన్ను వసూళ్లను ప్రారంభించినట్లు రిజినల్ ట్రాన్స్‌పోర్టు అధికారి కృష్ణయ్య తెలిపారు. 1-06-2014 రాష్ట్ర విభజన చట్ట ప్రకారం మార్చి 31-03-2015 వరకు గడువు ముగియడంతో 1-04-2015 నుంచి జిఓ నెంబర్ 15 ప్రకారం రాష్ట్ర ప్రవేశ రుసుము వాహనాల నుంచి వసూలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు దాదాపుగా రూ.10లక్షలకు పైగా వసూళ్లు చేసినట్లు తెలిపారు. ఈ చెక్‌పోస్టు ద్వారా ఒక నెలకు రూ.70లక్షల నుంచి రూ.80లక్షల వరకు పన్ను వసూళ్ల ద్వారా రావచ్చని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన కొత్త పన్ను విధానం వల్ల మాకు భారంగా మారిందని ఆయా వాహనదారులు ఆవేదన వెల్లిబుచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఎ అధికారులు పురుషోత్తం, శివలింగం, షకీల్‌అహ్మద్ తదితర అధికారులు పాల్గొన్నారు.
