(13 Apr) హైదరాబాద్, ఏప్రిల్ 13: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును సోమవారం నాడు ఫిలింసిటీ ఎండీ రామోజీరావు కలిశారు. ఈ సందర్భంగా ...
(13 Apr) హైదరాబాద్, ఏప్రిల్ 13: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును సోమవారం నాడు ఫిలింసిటీ ఎండీ రామోజీరావు కలిశారు. ఈ సందర్భంగా రామోజీఫిల్మ్ సిటీ దగ్గర నిర్మించతలపెట్టిన ''ఓం ఆధ్యాత్మిక నగరం'' కాపీ టేబుల్ బుక్ మొదటి ప్రతిని సీఎం కేసీఆర్కు అందజేశారు. ఓం సిటీలో 108 ప్రసిద్ధ ఆలయాల నమూనాలను నిర్మిస్తున్నామని, ఈ సిటీ అంతా తిరిగేందుకు వారం పడుతుందని రామోజీ రావు తెలిపారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక నగరం నిర్మించడం అభినందనీయమన్నారు. హైదరాబాద్లో ఆధ్యాత్మిక నగరం నిర్మాణంతో 30 వేల మందికి ఉపాధి అవకాశం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఓం ఆధ్యాత్మిక నగర నిర్మాణం త్వరితగతిన పూర్తికావాలని కేసీఆర్ ఆకాంక్షించారు.