(23 Apr) మంచిర్యాల, ఏప్రిల్ 22: ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం మంజూరు చేసిన ఫీజు రియంబర్స్మెంట్లో డిగ్రీ కాలేజీలు అనేక అవకతవకలకు పాల్ప...
(23 Apr) మంచిర్యాల, ఏప్రిల్ 22: ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం మంజూరు చేసిన ఫీజు రియంబర్స్మెంట్లో డిగ్రీ కాలేజీలు అనేక అవకతవకలకు పాల్పడుతున్నాయని తెలంగాణ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు చిప్పకుర్తి శ్రీనివాస్ ఆరోపించారు. ఫీజు రియంబర్స్మెంట్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో కేవలం రియంబర్స్మెంట్ కోసం కొన్ని కళాశాలలు పుట్టుకవచ్చాయని, 2009-14 వరకు ఫీజు రియంబర్స్మెంట్ పొందిన కాలేజీల వివరాలను, విద్యార్థుల ఆదాయ దృవీకరణ పత్రాల జారీపై విచారణ జరిపించి తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించి రియంబర్స్మెంట్ పొందిన యాజమన్యాల గుర్తింపు రద్దు చేయాలని కోరారు. అదేవిధంగా డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులను కనీస అర్హత లేనివారిని నియమిస్తున్నారని, యూనివర్సిటి అధికారులు దృష్టిసారించి అలాంటి కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
