సింగరేణి సంస్థలో జూనియర్ అసిస్టెంట్స్, ఐటీఐ ఫిట్టర్స్, ఎలక్ట్రిషియన్స్తో పాటు వివిధ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి...
సింగరేణి సంస్థలో జూనియర్ అసిస్టెంట్స్, ఐటీఐ ఫిట్టర్స్, ఎలక్ట్రిషియన్స్తో పాటు వివిధ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే! దీంతో ఆయా పోస్టులు దక్కించుకునేందుకు వేలాది మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకుంటున్నారు.
దళారుల రంగ ప్రవేశం..
చాలా ఏళ్ల తర్వాత నోటిఫికేషన్ వెలువడడంతో దళారులు రంగప్రవేశం చేశారు. అడిగినంత చేతిలో పెడితే కోరుకున్న కొలువు మీ సొంతం.. అంటూ అమాయకులే లక్ష్యంగా వల విసురుతున్నారు. ఉద్యోగాన్ని బట్టి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల దాకా డిమాండ్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ముందుగా రూ.5 లక్షలు ముట్టజెప్పి, ఉద్యోగం వచ్చాక మిగిలిన మొత్తాన్ని ఇచ్చేలా ఒప్పందం కూడా కుదుర్చుకుంటున్నట్లు తెలిసింది. దళారుల్లో పలువురు రాజకీయ నాయకులు, కార్మిక సంఘాల నేతలున్నట్లు సమాచారం.
పారదర్శకంగా భర్తీ..
చాలాకాలం తర్వాత సింగరేణిలో, అదీ తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న ఉద్యోగ భర్తీ కావడంతో పారదర్శకంగా నిర్వహించాలని సంస్థ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నాయి. సర్కారు ఆదేశాల మేరకు ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా కేవలం రాతపరీక్ష ద్వారా వచ్చిన మార్కుల ఆధారంగా భర్తీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే దరఖాస్తుల స్వీకరణ మొదలుకొని అన్ని ప్రక్రియలను ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించనున్నారు. కాగా, పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామనీ, ఎలాంటి పైరవీలు పనిచేయవంటున్న అధికారులు, ఎట్టి పరిస్థితుల్లో దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని హెచ్చరిస్తున్నాయి. నిరుద్యోగ అభ్యర్థులూ.. తస్మాత్ జాగ్రత్త!