(2 Apr) కొత్తగూడెం, ఏప్రిల్ 1: సింగరేణి వ్యాప్తంగా 11ఏరియాలు ఉండగా కొత్తగూడెం ఏరియా 2014-15 ఆర్థిక సంవత్సరంలో అధికోత్పత్తి సాధించి రారాజ...
(2 Apr) కొత్తగూడెం, ఏప్రిల్ 1: సింగరేణి వ్యాప్తంగా 11ఏరియాలు ఉండగా కొత్తగూడెం ఏరియా 2014-15 ఆర్థిక సంవత్సరంలో అధికోత్పత్తి సాధించి రారాజుగా నిలిచింది. జనవరి 19వతేదీనే నిర్దేశించుకున్న 58లక్షల బొగ్గు ఉత్పత్తిని సాధించుకుంది. ఆర్థిక సంవత్సరంలో 58లక్షల టన్నులకు 77.63లక్షల టన్నులు సాధించి 134శాతం ఉత్పాదకరేటుతో సంస్థలోనే అగ్రస్థానంలో నిలిచింది. రుద్రంపూర్‌లోని సింగరేణి అతిధిగృహంలో అధికారులతో కలిసి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఏరియా చీఫ్ జనరల్ మేనేజర్ ఎం మల్లేష్ మాట్లాడుతూ ఏరియాను అగ్రస్థానంలో నిలిపిన అధికారులకు, కార్మికులకు అభినందనలు తెలిపారు. గనుల వారీగా వివరాలు తెలిపారు. కొత్తగూడెం ఏరియా పరిధిలోని జికెఓసి ఉత్పత్తి లక్ష్యం 20లక్షల టన్నులు కాగా 24.16శాతం సాధించి 121శాతం, జెవిఆర్ ఓసి 30లక్షల టన్నులకు 45లక్షల టన్నులు సాధించి 150శాతం ఉత్పాదకరేటుతో సింగరేణిలో అగ్రస్ధానంలో నిలిచింది. భూగర్భగనులలో వికె 7ఇంక్లైన్ 4.25లక్షల టన్నులకు 5.49లక్షల టన్నులు సాధించి 129శాతం, పివికె -5ఇంక్లైన్ 3.75లక్షల టన్నులకు 2.98లక్షలు సాధించి 80శాతం ఉత్పాదకరేటును నమోదు చేసుకున్నాయి. అంతేకాకుండా రవాణాలో 8.156మిలియన్ టన్నులు చేసి రికార్డు నెలకొల్పింది. మార్చి 29న ఆర్సిహెచ్పి నుండి 12రేకులను రవాణ చేసి మరోరికార్డు కైవసం చేసుకుంది. మొత్తంగా 1958రేకుల రవాణా చేసిన ఘనతను దక్కించుకుంది. గనుల విస్తరణ విషయమై సిజిఎం మాట్లాడుతూ జెవిఆర్ఓసి-2 ప్రాజెక్టు అవకాశాలను బట్టి 2016-17 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించే అవకాశంవుందని, ఒకవేళ సఫలీకృతం అయితే 10మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్ధేశించుకుంటామని అధికారుల కరతాళధ్వనుల మధ్య ప్రకటించారు. ఉపాధి అవకాశాల కోసం అనేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, సిఎస్ఆర్ పాలసీ కింద ప్రజాసంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. కాలనీలలో మెరుగైన సౌకర్యాలు, గనుల వద్ద కార్మికులకు అవసరమైన సౌకర్యాలను కల్పించామని తెలిపారు. విలేఖరుల సమావేశంలో ఏరియా అధికారులు విఎన్విఏస్వి ప్రసాద్, కె సూర్యనారాయణ, ఎస్ శంకర్, ఆర్ నాగేంద్రకుమార్, ఎస్ రవీందర్, కె వెంకటేశ్వర్లు, ఎం షాలెంరాజు, అల్లి రాజేశ్వర్, ఆర్ నారాయణరావు, పి గోవిందప్ప, ఎస్ లక్ష్మణ్‌రావు, టివి రావు, కెజెఆర్ పాల్, పిజె ఫిజ్గెరాల్డ్, మేరుగు ఓదెలు, జి ప్రభాకర్‌రావు, డివి సుబ్రహ్మణ్యం, శ్రీనివాసరావు, బి రవీందర్, ఎస్ వెంకటాచారి, కెవిఆర్ ప్రకాశ్, ఆర్ కుమారస్వామి, వి సాయికృష్ణ, డి తారాకుమార్, ఎం నాయుడు, వై వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, కరీముల్లా, డిఎన్ఎస్ సుకుమార్, దామోదర్‌లు పాల్గొన్నారు.
