మంచిర్యాలలోని పలు కోచింగ్ సెంటర్లకు మండల విద్యాశాధికారి ఆధ్వర్యంలో షోకాజ్ నోటీసులను సోమ, మంగళ, బుధ వారాలలో జారీ చేశారు. ఈ విషయంపై మండల వ...
మంచిర్యాలలోని పలు కోచింగ్ సెంటర్లకు మండల విద్యాశాధికారి ఆధ్వర్యంలో షోకాజ్ నోటీసులను సోమ, మంగళ, బుధ వారాలలో జారీ చేశారు. ఈ విషయంపై మండల విద్యాధికారి గణపతి రెడ్డిని వివరణ అడుగగా జిల్లా విద్యాశాధికారి ఆదేశానుసారంగా మంచిర్యాలలో గ్రూప్1, గ్రూప్2, ఎస్ఐ,కానిస్టేబుల్, టీటీసీ, ఎడ్సెట్, మొదలగు కోచింగ్ సెంటర్లు పదహారు ఉన్నాయని గుర్తించి వాటికి నోటిసులు ఇచ్చామని విద్యాశాఖ నిబంధనల ప్రకారం కోచింగ్ సెంటర్లు రిజిస్ట్రేషన్ చేసుకొని పదివేల రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉందని అంతేకాక జీఓ నంబర్ 200 ప్రకారం నిబంధనలు అనుసరించి కోచింగ్ సెంటర్లు నడుపాలని తెలిపారు. నెల రోజుల లోపల నిబంధల ప్రకారం కోచింగ్ సెంటర్లు ఉండాలని తెలిపారు. లేదంటే ఎడ్యూకేషన్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
