(22 Apr) కాగజ్‌నగర్, ఏప్రిల్ 21 : జిల్లాలో ఉన్న ప్రాజెక్టులను ప్రభుత్వం పూర్తి చేయాలని, జిల్లాలో మూతబడి ఉన్న పరిశ్రమలను తెరిపించాలని సిపిఐ...
(22 Apr) కాగజ్‌నగర్, ఏప్రిల్ 21 : జిల్లాలో ఉన్న ప్రాజెక్టులను ప్రభుత్వం పూర్తి చేయాలని, జిల్లాలో మూతబడి ఉన్న పరిశ్రమలను తెరిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ అన్నారు. మంగళవారం స్థానిక అంబేద్కర్ భవనంలో జరిగిన సిర్పూర్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాణహిత ప్రాజెక్టును సిర్పూర్ నియోజకవర్గం నుండి తరలించడానికి ప్రభుత్వం పాటుపడుతున్నదని, ఈ ప్రాజెక్టును కాళేశ్వరంకు తీసుకెల్లడానికి ప్రభుత్వం కృషిచేస్తున్నదని, ఈ ప్రాంత ప్రజలకు ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదన్నారు. ఈ ప్రాజెక్టు డిజైన్ మార్చడానికి చేస్తున్న ప్రభుత్వ ప్రయత్నాన్ని ప్రజలు తిప్పికొట్టాలని కోరారు. 2నుండి 10 వరకు పలుఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని, రాష్ట్రంలో నిర్భందం కొనసాగుతుందని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విమలక్కపై ప్రభుత్వం కేసులునమోదుచేసిందన్నారు. భవిష్యత్తులో వామపక్షపార్టీలన్ని ఏకం కానున్నాయని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం వామపక్షపార్టీలు పనిచేస్తాయన్నారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అంబాల ఓదేలు మాట్లాడుతు సిర్పూర్ పేపర్‌మిల్లు తెరిపించేవరకు తాముతమపోరాటాన్ని మరింత ఉద్ధృతంచేస్తామన్నారు. మిల్లుమూతబడి 7నెలలు దాటినా ప్రభుత్వం స్పందించకపోవడం ప్రభుత్వ నిబద్దతకు నిదర్శనమన్నారు. ఈసమావేశంలో సిర్పూర్ మండల కార్యదర్శి జి.మల్లేశ్, దహెగాం మండల కార్యదర్శి నాగుల తిరుపతి తదితరులు పాల్గొన్నారు. రబీ సాగుకు తప్పని కష్టాలు ఖప్రాజెక్టులో అడుగంటిన భూగర్భ జలాలు ఖఎండిపోయన కాలువలు ఖఆందోళనలో రైతులు మంచిర్యాలరూరల్, ఏప్రిల్ 21: ఖరీఫ్ కాలమంతా నష్టాలే తప్ప పంటలు మిగులలే. ఇక ఏస్కి(రబీ) పంటనన్న ఏసుకుందామంటే..ప్రాజెక్టుల్ల నీరు పంటలకు అందేటట్టు లేదు. అండ్ల ఉన్న యెగిన్నన్నినీరు అవిగూడ కాలువల్లో పారెటట్టు లేవ్వు. అసల్కైతే చానసోట్ల కాల్వలే లేకపోయే. ఇక ఏస్కి పంటల మద ఆశేట్లుంటది. ఇవి సగటు రైతన్న గోడు. ఖరీఫ్ కలిసిరాకున్నా రబీలోనైనా పంటలు సాగు చేద్దామనుకున్న రైతులకు నీటి సౌకర్యం లేదనే విషయం మింగుడు పడటం లేదు. జిల్లాలోని ప్రాజెక్టుల్లో తగినంత నీరు లేదు. ఒకవైపు విద్యుత్ కోతలు, మరోవైపు ప్రాజెక్టు కాల్వల నుంచి నీరందక వరి పొలాలు ఎండిపోతున్నాయి. పొలాలకు చుక్క నీరందకపోవడంతో పొలాలు బీటలుగా మారడంతో పంటల పొలాలు బీటలుగా మారడంతో వాటిని చూస్తే రైతులకు కునుకు రావడం లేదు. ఇలాగే ఇంకా నాలుగు రోజులుంటే చాలా పొలాలు వదిలి వేసుకుంటామోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో 30వేల ఎకరాలకు పైగా వ్యవసాయ భూములకు సాగునీటిని అందించేందుకు కడెం ప్రాజెక్టు నుంచి కాల్వలను ఏర్పాటు చేశారు. దండేపల్లి, లక్సెట్టిపేట, మంచిర్యాల మండలాల పంట పొలాలకు కడెం నీరు అందాల్సి ఉన్నా కాల్వలు అస్తవ్యస్థంగా ఉండటంతో చివరి వరకు నీరు అందడం లేదు. మంచిర్యాల మండలంలోని గుడిపేట, ముల్కల్లలో పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో మంచిర్యాల మండలంలోని గుడిపేట, ముల్కల్ల, వేంపల్లి గ్రామాల్లోని 6వేల ఎకరాలకు సాగునీటిని అందించాలన్న ఉద్దేశంతో రూ.33కోట్లతో మండలంలోని ముల్కల్ల గ్రామంలో ర్యాలీవాగు ప్రాజెక్టును 2009లో అప్పటి దివంగత ముఖ్యమంత్రి వై ఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించారు. ప్రాజెక్టు నీటి మట్టం 15.15మీటర్లు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 151.1మీటర్ల నీరు ఉంది.