(19 Apr) గణపురం: వరంగల్ జిల్లా గణపురం మండలం మైలారం నల్లగుట్టల్లో వందల ఏండ్లనాటి జంతువుల దంతాలు, ఎముకలు వెలుగుచూశాయి. ఇటీవల నల్లగుట్ట చారి...
(19 Apr) గణపురం: వరంగల్ జిల్లా గణపురం మండలం మైలారం నల్లగుట్టల్లో వందల ఏండ్లనాటి జంతువుల దంతాలు, ఎముకలు వెలుగుచూశాయి. ఇటీవల నల్లగుట్ట చారిత్రక ప్రాధాన్యంపై పత్రికల్లో కథనాలు రావడంతో శనివారం స్థానికులు పరిశీలించడానికి వెళ్లారు. గుట్టలోపల నిర్మానుష్య ప్రాంతంలో వందల ఏండ్లకిందటివిగా భావిస్తున్న పెద్దపులి, చిరుత పులి, ఎలుగుబంటి గోర్లు, దంతాలను గుర్తించారు. పురాతత్వ శాస్త్రవేత్తలు అన్వేషిస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు.