(18 Apr) రామగుండం, ఏప్రిల్ 17: రామగుండంలో కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలన్న ఎన్టీపీసీ యాజమాన్యానికి భూ సమస్య తలనొప్పిగా మారిం...
(18 Apr) రామగుండం, ఏప్రిల్ 17: రామగుండంలో కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలన్న ఎన్టీపీసీ యాజమాన్యానికి భూ సమస్య తలనొప్పిగా మారింది. 1600 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని నిర్మా ణం చేసేందుకు అంతా సిద్ధం చేసుకున్నప్పటికి అసలు యాష్ పాండ్ (బూడిద చెరువు) నిర్మాణం కోసం భూమే కీలకమైంది. రామగుండం మండలంలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి ఎన్టీపీసీకి ఇచ్చేందుకు రెవెన్యూ యంత్రాంగం పూర్తి సిద్ధంగా ఉన్న ఇంకా అప్పగింతలు ఒక కొలిక్కి రాలేదు. ప్రసుతం ఎన్టీపీసీ విద్యుత్ సంస్థ వినియోగించుకుంటున్న మండలంలోని కుందనపల్లి యాష్ పాండ్ (బూడిద చెరువు) 2019తో కాల పరిమితి చెల్లి పోనున్నందున ఎన్టీపీసీ యాజమాన్యంలో కలవరం రేపుతుంది. ఎన్టీపీసీ సంస్థకు యాష్ పాండ్ కోసమని సుమారు 500 ఎకరాల భూమి కావాల్సి ఉంది. దీనికి తోడు మరిన్ని ప్లాంట్ల విస్తరణ కోసమని కూడా ఎన్టీపీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇటీవలనే సంప్రదించి భూమి కేటాయింపులు చేయాలని చర్చలు జరిపారు. తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న విద్యుత్ సంక్షోభాన్ని తీర్చేందుకు ముందుకు వస్తున్న ఎన్టీపీసీ కొత్త విద్యుత్ ప్లాంట్ ఏర్పాటులో భాగంగా యాష్ పాండ్ కోసం భూమి అప్పగిచేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో గత 7నెలలుగా రామగుండం మండలంలోని అంత ర్గాం, గోలివాడ, రాయదండి, కుందనపల్లి, రామగుం డం ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు స్వయంగా పరిశీలించారు. ఇప్పటికే వినియోగంలో ఉన్న కుందనపల్లి యాష్ పాండ్‌కు సమీపంలోనే కావాల్సిన 500 ఎకరాల భూమిని కేటాయించాలని ఎన్టీపీసీ పట్టుబడుతుంది. ఐతే కుందనపల్లి యాష్ పాండ్ సమీప ప్రాంతంలో 500ఎకరాల భూమి దొరకడం సాధ్యం కాకపోగా కుందనపల్లిలోని 455సర్వే నెంబరులో కేవలం 150ఎకరాల భూమి మాత్రమే అనుకూలంగా ఉన్న ట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అలాగే అంతర్గాంలో 255/1 సర్వే నెంబరులో సుమారు 800ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉన్నట్టుగా సర్వేలో గుర్తించారు. అంతర్గాం ప్రాంతంలో యాష్ పాండ్ఏర్పాటుకు అనుకూలంగాలేదని, ఈ భూమికి సమీపంలోని రైల్వేట్రాక్, గోదావరి నది, జనవాసాలు వందల మీటర్ల దూరంలోనే ఉండడంతో మిగతా భూ సేకరణ సమస్యతోపాటు గోదావరి పర్యావరణ సమస్యలు తలెత్తుతాయని ఎన్టీపీసీ వెనుకడుగు వేస్తోంది. రామగుండంలోని ప్రస్తుత జెన్కో యాష్‌పాండ్ సమీపంలో 322, 557 సర్వే నెంబర్లలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి అనుకూలంగా ఉన్నట్టు ఇటీవలనే రామగుండం రెవెన్యూ ఎన్టీపీసీకి వివరించింది. ఐతే ఈ భూమిలో కొంత అటవీ శాఖకు చెందిన భూమి కూడా కలిసి ఉండడంతో ఫారెస్టు అనుమతుల కోసం ఎన్టీపీసీ ఎదురు చూపులు చూస్తుంది.