కోరుట్ల: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పెట్టుకొని పని చేద్దాం ఇందులో ప్రజాప్రతినిధులతోపాటు అధికారులు పునరంకితమై సిఎం కెసిఆర్ కలలు గన్న బంగా...
కోరుట్ల: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పెట్టుకొని పని చేద్దాం ఇందులో ప్రజాప్రతినిధులతోపాటు అధికారులు పునరంకితమై సిఎం కెసిఆర్ కలలు గన్న బంగారు తెలంగాణ రాష్ట్ర సాధించుకుందామని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. శుక్రవారం కోరుట్ల పట్టణంలోని 1, 28వార్డుల్లో నూతనంగా నిర్మించ నున్న బోరుబావుల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఇలాగే జవహర్ రోడ్డులోని అభయాంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి, హోమంలో పాల్గొన్నారు. అనంతరం కొత్త బస్టాండ్ చౌరస్తాలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల మాట్లాడుతూ మనను ఎన్నుకున్న ప్రజలకు సేవ చేసేందుకు ప్రజాప్రతినిధులు పురంకితం కావాలని, అధికారులు ఇందుకు సహకరించాలని కోరారు. ఈకార్యక్రమంలో కోరుట్ల మున్సిపల్ చైర్మన్ శీలం వేణుగోపాల్, కౌన్సిలర్లు కస్తూరి వాణి, లక్ష్మినారాయణ, పుప్పాల ఉమాదేవి, ప్రభాకర్, ఇఓ ప్రసాద్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
